Astrazeneca Vaccine: రక్తం గడ్డకట్టి టీనేజర్ మృతి.. టీకా పంపిణీ నిలిపివేత.. ( వీడియో )

Phani CH

|

Updated on: Jun 13, 2021 | 7:40 PM

అరవై ఏళ్ల లోపు వయసున్న వారికి ఆక్సఫర్డ్-ఆస్ట్రాజెనెకా రూపొందించిన టీకా ఇవ్వబోమని ఇటలీ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ టీకా పంపిణీని నిలిపివేస్తున్నామని ప్రకటించింది.

అరవై ఏళ్ల లోపు వయసున్న వారికి ఆక్సఫర్డ్-ఆస్ట్రాజెనెకా రూపొందించిన టీకా ఇవ్వబోమని ఇటలీ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ టీకా పంపిణీని నిలిపివేస్తున్నామని ప్రకటించింది. ఇటీవల టీకా తీసుకున్న ఓ టీనేజర్లో రక్తం గడ్డకట్టి అతడు మరణించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అత్యంత అరుదుగా మాత్రమే సంభవించే ఈ రుగ్మత కారణంగా ఆ టీనేజర్ మే 25న మృతి చెందాడు. మరోవైపు.. ఇప్పటికే ఆస్ట్రాజెనెకా టీకా మొదటి డోసు తీసుకున్న వారికి రెండో డోసు కింద మరో టీకా ఇస్తామని కూడా ప్రభుత్వం పేర్కొంది. ఆస్ట్రాజెనెకా టీకా కారణంగా రక్తం గడ్డకడుతాయన్న అనుమనాంతో ముందుగా జాగ్రత్తగా పలు దేశాలు ఈ టీకా పంపిణీని తాత్కాలికంగా నిలిపివేశాయి. ఈ జాబితాలోకి తాజాగా ఇటలీ కూడా వచ్చి చేరింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: TV9 Impact: ఆ చిన్నారి ఇంజక్షన్‌ ఖరీదు 16కోట్లు..!! క్రౌడ్ ఫండింగ్ ద్వారా అపన్న హస్తం అందించిన దాతలు.. ( వీడియో )

Allu Arjun: బాలీవుడ్ పై కన్నేస్తున్న అల్లు అర్జున్.. హిందీ ఆడియన్స్ కోసం భారీ ప్లాన్.. ( వీడియో )