రీల్స్ కాదు, రైల్వే మాకు ముఖ్యం.. ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ ఇచ్చిన అశ్విని వైష్ణవ్

రీల్స్ కాదు, రైల్వే మాకు ముఖ్యం.. ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ ఇచ్చిన అశ్విని వైష్ణవ్

Ravi Kiran

|

Updated on: Aug 01, 2024 | 6:34 PM

ఇటీవల వరుసగా రైళ్లు పట్టాలు తప్పుతుండటం, ప్రమాదాలపై గురువారం లోక్‌సభ‌ దద్దరిల్లింది. ఈ అంశంపై అటు ప్రతిపక్షాలు, ఇటు అధికారపక్షం మధ్య మాటల యుద్ధం జరిగింది. రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ను ప్రతిపక్షాలు 'రీల్ మినిస్టర్' అంటూ నినాదాలు చేసి ఎగతాళి చేశాయి.

ఇటీవల వరుసగా రైళ్లు పట్టాలు తప్పుతుండటం, ప్రమాదాలపై గురువారం లోక్‌సభ‌ దద్దరిల్లింది. ఈ అంశంపై అటు ప్రతిపక్షాలు, ఇటు అధికారపక్షం మధ్య మాటల యుద్ధం జరిగింది. రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ను ప్రతిపక్షాలు ‘రీల్ మినిస్టర్’ అంటూ నినాదాలు చేసి ఎగతాళి చేశాయి. ఇక వారి విమర్శలను గట్టిగా తిప్పికొట్టారు రైల్వేమంత్రి. ‘మేం కేవలం రీళ్లు చేసేవాళ్లం కాదు.. కష్టపడి పనిచేసేవాళ్లం’ అని మంత్రి అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే భద్రతా చర్యలను విస్మరించారని.. అలాగే ఎలప్పుడూ ఈ సమస్యను రాజకీయం చేయాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయంటూ మండిపడ్డారు అశ్విని వైష్ణవ్.

’58 ఏళ్లు అధికారంలో ఉండగా 1 కిలోమీటరుకు కూడా ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్(ఏటీపీ) ఏర్పాటు చేయలేకపోయినవారు.. ఇప్పుడు ఆ ప్రశ్నలను లేవనెత్తడానికి ధైర్యం చేస్తున్నారు’ అని ప్రతిపక్షాలపై రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ధ్వజమెత్తారు. అంతేకాకుండా లోకోమోటివ్ డ్రైవర్లతో రీళ్లు తయారు చేయడంతో బిజీగా ఉన్నవారు తమ హయాంలో ఏం చేయలేకపోయారని.. జూలై 7న ఢిల్లీలో లోకోపైలట్‌లను కలిసిన రాహుల్ గాంధీ పర్యటనను ఉద్దేశించి మాట్లాడారు కేంద్రమంత్రి. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో వార్షిక సగటు రైలు ప్రమాదాల సంఖ్య 171 కాగా, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని 10 ఏళ్ల బీజేపీ ప్రభుత్వ హయాంలో ఇది 68 శాతం తగ్గిందని మంత్రి పేర్కొన్నారు.