Eluru Agency: అరకు అందాలతో పోటీపడుతున్న ఏలూరు ఏజెన్సీ

|

Oct 27, 2023 | 2:08 PM

విశాఖలోని అరకు లోయను ఆంధ్రా ఊటీగా పిలుస్తారు. ఎందుకంటే అక్కడి ప్రకృతి అందాలు కాశ్మీర్‌ లోయను తలపిస్తాయి. ఇప్పుడు ఈ అందాల అరకులోయతో పోటీ పడుతోంది ఆంధ్రప్రదేశ్‌లోని మరో ప్రాంతం. ఏలూరు ఏజెన్సీ పచ్చని, ఎట్లు, ఎత్తైన కొండల నడుమ గలగలా పారే గోదావరి ప్రకృతి ప్రేమికులను రారమ్మని ఆహ్వానిస్తున్నాయి. ఏలూరు జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతమైన.. విలేరుపాడు నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో కట్కూరు అనే గ్రామం ఉంది.

విశాఖలోని అరకు లోయను ఆంధ్రా ఊటీగా పిలుస్తారు. ఎందుకంటే అక్కడి ప్రకృతి అందాలు కాశ్మీర్‌ లోయను తలపిస్తాయి. ఇప్పుడు ఈ అందాల అరకులోయతో పోటీ పడుతోంది ఆంధ్రప్రదేశ్‌లోని మరో ప్రాంతం. ఏలూరు ఏజెన్సీ పచ్చని, ఎట్లు, ఎత్తైన కొండల నడుమ గలగలా పారే గోదావరి ప్రకృతి ప్రేమికులను రారమ్మని ఆహ్వానిస్తున్నాయి. ఏలూరు జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతమైన.. విలేరుపాడు నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో కట్కూరు అనే గ్రామం ఉంది. అక్కడ సుందర వాతావరణం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. కాలాలతో సంబంధం లేకుండా ఏడాది పొడుగునా పచ్చదనంతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. గోదావరి ఉధృతి సమయంలో తప్ప మిగతా రోజులలో అక్కడికి సులభంగా వెళ్లవచ్చు. వేలూరుపాడు నుంచి కట్కూరికి వెళ్లే రోడ్డు మార్గం ఎంతో ఆహ్లాదరకంగా ఉంటుంది. కొండల మీదనుంచి వీచే చల్లని గాలి, రహదారికి ఇరువైపులా పచ్చని పంటపొలాలు మనసును వేరే లోకానికి తీసుకువెళ్తాయి. ఇక్కడ ఆహ్లదకరమైన వాతావరణంతోపాటు ఆథ్యాత్మికత కూడా ఉట్టిపడుతుంది. ఇక్కడ కొండపై మహిశివుడు కొలువై ఉన్నాడు. మహాశివరాత్రి నాడు కొండపై శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారత్‌లో త్వరలో స్కై బస్సు సర్వీసులు !! గంటకు 100 కి.మీ. వేగంతో ప్రయాణించే సామర్థ్యం

10 నిమిషాల్లో పెళ్లి… పెళ్లి వద్దంటూ 100 కి డయల్ చేసిన వరుడు !!

Skanda OTT: బ్యాడ్‌ న్యూస్‌.. స్కంద ఓటీటీ స్ట్రీమింగ్‌ వాయిదా

Amala Paul: పబ్ లో ప్రపోజల్.. మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్న అమలాపాల్

Chiranjeevi: ముల్లోకాలను శాసించే విశ్వంభర..

 

Follow us on