Andhra: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. బిగ్ అప్‌డేట్ ఇదిగో..
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. జీరో ఫేర్ టికెట్ ఇవ్వాలని సూచించారు. మరి ఆ పథకానికి సంబంధించిన కీలక అప్ డేట్ ఇప్పుడు చూసేద్దాం.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.
ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో మహిళలకు అమలు చేయనున్న ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో మహిళలకు ‘జీరో ఫేర్ టిక్కెట్’ ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎక్కడ నుంచి ఎక్కడకు ప్రయాణం చేస్తున్నారని ఇంకా ఉచిత ప్రయాణంతో ఎంత మేర వారికి డబ్బులు ఆదా అయ్యాయో అలానే 100 శాతం ప్రభుత్వం ఇస్తున్న రాయితీ వంటి వివరాలు టిక్కెట్‌లో పొందుపరచాలని అధికారులకు సూచించారు. సచివాలయంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. జీరో ఫేర్ టిక్కెట్ ఇవ్వడం ద్వారా ఎంత లబ్ది పొందారనే విషయం రాష్ట్రంలోని మహిళా ప్రయాణికుల అందరికీ సులభంగా తెలుస్తుందని సీఎం అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఏ ఏ రాష్ట్రాలకు ఆర్ధికంగా ఎంత భారం పడిందోనని అలానే మన రాష్ట్రంలో ఎంత వ్యయం కానుందనే అంశాలపై సీఎం చర్చించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

