ఏపీకి మరో తుఫాన్ గండంమరో 4 రోజుల్లో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి 'సెన్‌యార్' తుఫానుగా బలపడనుంది. ఈ నెల 26 నుంచి 29 వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైతులు పంటలను కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
తెలుగు రాష్ట్రాల్లో తుఫాను గుబులు రేపుతోంది. మొంథా తుఫాన్ నష్టం నుంచి ఇంకా తేరుకోకముందే మరో తుఫాన్ ముప్పు పొంచి ఉంది. తుఫాన్ ప్రభావంతో ఈనెల 26వ తేదీ నుంచి కోస్తా, రాయలసీమల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. శనివారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి..అది పశ్చిమ వాయవ్యంగా పయనించి ఈనెల 24వ తేదీకల్లా వాయుగుండంగా మారి దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించనుందని ఐఎండీ అధికారులు తెలిపారు. ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమ వాయవ్యంగా పయనించే క్రమంలో తుఫాన్‌గా మారి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు రానున్నదని ఐఎండీ తెలిపింది. తుఫాన్‌కు ‘సెన్‌యార్’గా నామకరణం చేయనున్నారు. ఈ విషయాన్ని ఐఎండీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గురువారం నాటి వాతావరణ పరిస్థితుల మేరకు ఈనెల 24వ తేదీ నుంచి తమిళనాడులో వర్షాలు ప్రారంభమవుతాయి. ఈనెల 26వ తేదీ నుంచి 29 వరకు తొలుత రాయలసీమ, దక్షిణ కోస్తా, ఆ తర్వాత ఉత్తరకోస్తాలో వర్షాలు కురుస్తాయి. 26 నుంచి 29వ తేదీ వరకు పలుచోట్ల భారీ, అక్కడక్కడ అతి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఎక్కువగా రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని కొన్ని మోడళ్లు, కోస్తా, రాయలసీమ మొత్తం వర్షాలు కురుస్తాయని మరికొన్ని మోడళ్లు అంచనా వేశాయి. ఈనెల 28వ తేదీన దక్షిణ కోస్తా, దానికి ఆనుకుని రాయలసీమ జిల్లాలు, 29న నెల్లూరు నుంచి కృష్ణా జిల్లా, రాయలసీమలోని అనేక జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఇస్రో వాతావరణ నిపుణుడు ఒకరు తెలిపారు.రైతాంగం వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా ధాన్యం తడవకుండా సురక్షితం చేసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఉత్తరాదిలో చలిగాలుల ప్రభావం, బంగాళాఖాతంలో ఉపరితల ఉష్ణోగ్రతల ప్రభావం తుఫాన్‌పై ఉంటుందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఇప్పటి స్థిర వాతావరణం ఇలాగే కొనసాగితే.. ఏర్పడబోయే తుఫాన్ కాకినాడ-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. అయితే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, ఉత్తరాది నుంచి వీచే చలిగాలులు ప్రభావం చూపుతాయని, అప్పుడు తీరం దాటే ప్రాంతంలో మార్పులు ఉంటాయని తెలిపారు. వరి, పత్తి ఇతర పంటల రైతులను ఐఎండీ అప్రమత్తం చేసింది. బంగాళాఖాతం నుంచి తూర్పుగాలులు వీస్తున్నందున శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిందితుడ్ని పట్టించిన ల్యాప్‌టాప్‌పై డీఎన్ఏ !! అమెరికాలో ఏపీ మహిళ హత్య..
ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా డ్యూటీ చేసిన ఎమ్మెల్యే
Rahul Sipligunj: సార్.. మీరు మా పెళ్ళికి తప్పకుండ రావాలి !!
