పారితోషికం పెంచేసిన జాన్వీ.. పెద్ది’కి ఎంత తీసుకుంటుందో తెలుసా?

Updated on: Jul 28, 2025 | 4:59 PM

శ్రీదేవి ముద్దుల కూతురు, పాపులర్ నటి..జాన్వీ కపూర్ ఇప్పుడు బాలీవుడ్‌తో బాటు సౌత్‌లోనూ దూసుకుపోతోంది. ‘దేవర’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ అందాల భామ.. తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. అదిరిపోయే అందం, ఆకట్టుకునే నటనతో, వరుస అవకాశాలతో సాగిపోతున్న జాన్వీ.. కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తూ.. సత్తా చాటుతోంది. ‘దేవర’ కోసం రూ. 5 కోట్ల పారితోషికం అందుకున్న జాన్వీ.. తాజాగా వస్తున్న చెర్రీ మూవీ.. పెద్ది కోసం మరో కోటి రూపాయలు పెంచి.. ఏకంగా రూ. 6 కోట్లు అందుకోనున్నట్లు తెలుస్తోంది.

రామ్ చరణ్, జాన్వీ జంటగా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ పాపులారిటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఆమెకు పాన్-ఇండియా స్థాయిలో మంచి గుర్తిపు ఉంది. జాన్వీని దక్షిణాది సినిమాలో తీసుకుంటే నార్త్ ఆడియెన్స్ ను సైతం ఆకట్టుకోవచ్చని దక్షిణాది నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే దర్శక నిర్మాతలు జాన్వీ ఎంత అడిగినా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ జాన్వీ కపూర్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను 2.6 కోట్లకు పైగా మంది అనుసరిస్తున్నారు. ఉప్పెన మూవీతో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు సనా బుచ్చిబాబు.. పెద్ది మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు, మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.

మరిన్ని వీడియోల కోసం :

లైవ్‌ కవరేజ్ చేస్తూ.. వరదలో కొట్టుకుపోయిన జర్నలిస్ట్‌ వీడియో

కోళ్ల షెడ్డుకు వేసిన ఫెన్సింగ్‌ నుంచి వింత శబ్దాలు.. దగ్గరకు వెళ్లి చూస్తే వీడియో

ఇదెక్కడి చోద్యం.. ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్న బ్రదర్స్ వీడియో

నదిలో ఉండాల్సిన మొసలి.. రోడ్డుపైకి రావడంతో.. వీడియో