Watch Video: శ్రీశైలంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఏసీబీ అధికారులు..

Watch Video: శ్రీశైలంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఏసీబీ అధికారులు..

J Y Nagi Reddy

| Edited By: Srikar T

Updated on: Feb 26, 2024 | 3:33 PM

నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రానికి మరోసారి ఏసీబీ అధికారులు చేరుకున్నారు. గతంలో జరిగిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఔటర్ రింగ్ రోడ్డు ప్రహరిగోడలను కొలతలు తీసుకున్నారు. నాణ్యత పరమైన విషయాలను పరిశీలించారు. శ్రీశైలం దేవస్థానం ఇంజనీర్లను వెంటపెట్టుకుని వారివద్ద వివరాలు సేకరించారు.

గతంలో చేసిన పనుల వివరాలతో కూడిన బ్లూ ప్రింట్ మ్యాప్‎తో ఎక్కడెక్కడ పనులు జరిగాయని తెలుసుకున్నారు. గతంలో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు రావడంతో పలుదఫాలుగా క్షేత్రంలో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించడం జరిగిందని.. మిగిలిపోయిన పనులను ఇప్పుడు పరిశీలిస్తున్నట్లు కర్నూలు ఏసీబీ సిఐ విశ్వనాథ్ మీడియాకు వివరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Feb 26, 2024 03:33 PM