రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
పశ్చిమ బెంగాల్‌లోని నబద్వీప్‌లో హృదయాన్ని కదిలించే సంఘటన చోటుచేసుకుంది. తల్లి వదిలేసిన నవజాత శిశువును వీధి శునకాలు రాత్రంతా కాపలా కాసి రక్షించాయి. సాధారణంగా దూకుడుగా ఉండే కుక్కలు, ఆ పసికందు చుట్టూ రక్షణ వలయంగా నిలిచి, చిన్న పురుగును కూడా దరిచేరనివ్వలేదు. ఉదయం స్థానికులు గుర్తించి శిశువును ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆరోగ్యంగా ఉంది.
రోడ్డుపైన నడిచి వెళ్లే వారిపైన వీధి శునకాలు దాడి చేస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది వీటి బారిన పడి ఆస్పత్రిపాలయ్యారు. చిన్నారులు, పెద్దలు అందరిపైనా అటాక్ చేసేవి. కానీ ఇందుకు పూర్తి విరుద్ధమైన సంఘటన, అందరికీ ఆశ్చర్యం కలిగించే ఓ అద్భుత ఘటన పశ్చిమ బెంగాల్‌లో జరిగింది. పశ్చిమబెంగాల్ నదియా జిల్లాలోని నబద్వీప్ పట్టణం రైల్వే వర్కర్ల కాలనీలో పబ్లిక్ టాయిలెట్ ముందు అప్పుడే పుట్టిన పసికందు కనిపించింది. బిడ్డపై రక్తపు మరకలు కూడా పోలేదు. పుట్టిన వెంటనే ఆ బిడ్డను తల్లి వదిలేసి వెళ్లింది. రోడ్డుపై ఆ బిడ్డను గమనించిన వీధి కుక్కలు అక్కడికి చేరుకున్నాయి. వాటి సహజ ప్రవర్తనకు భిన్నంగా ఆ బిడ్డ చుట్టూ రక్షణ వలయంగా నిలుచున్నాయి. మొరిగితే ఆ బిడ్డకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అన్నట్లుగా నిశ్శబ్దంగా రాత్రంతా ఆ బిడ్డకు కాపలా కాశాయి. ఎంతో శిక్షణ పొందిన బాడీగార్డ్స్‌లాగా రక్షణ కవచంగా నిలిచాయి. చిన్న పురుగును కూడా బిడ్డ సమీపంలోకి రానివ్వలేదు. పూర్తిగా తెల్లవారాక వీధి కుక్కల మధ్య పసికందును గమనించి స్థానికులు ఆశ్చర్యపోయారు. పసికందు ఏడుపు వినిపించి స్థానికులు బయటకు వచ్చారు. రోడ్డుపై శునకాల మధ్య ఉన్న శిశువును చూసి షాకయ్యారు. ఓ మహిళ ధైర్యం చేసి బిడ్డ దగ్గరకు వెళ్లింది. దాంతో ఆ శునకాలు ఇంతటితో తమ బాధ్యత తీరింది…ఇక ఈ బిడ్డను కాపాడాల్సింది మీరే అన్నట్టుగా అక్కడి నుంచి సైలెంట్‌గా వెళ్లిపోయాయి. కనీసం దుప్పటిలోనైనా చుట్టకుండా రోడ్డుపైన వదిలేయడంతో రాత్రంతా చలిలో ఉన్న ఆ బిడ్డను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆ పసికందు ఆరోగ్యంగా ఉందని నబద్వీప్ పట్టణ చైల్డ్ హెల్ప్ అధికారులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
ప్రైవేటు క్యాబ్ ట్యాక్సీల దోపిడీకి చెక్.. భారత్ టాక్సీ సేవలు షురూ..!
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

