ఏపీలో చొరబడ్డ జికా వైరస్‌.. అంతటా టెన్షన్‌.. టెన్షన్‌..

|

Dec 20, 2024 | 4:05 PM

కరోనా మహమ్మారి అంతం కాలేదు. యుద్ధం ముగియలేదు.. ఇంకా మిగిలే ఉంది. కానీ ఇక్కడే ఓ స్మాల్ ఛేంజ్.. రూపం.. వేషాలు మార్చి.. వైరస్ దాడి చేస్తూనే ఉంది. కొత్త కొత్త వేరియంట్లు.. ప్రమాదకరమైన వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. ఏముందిలే అని లైట్ తీస్కోడానికి అసలే లేదు. ఎందుకంటే.. ఈ మాయరోగం రోజుకో కొత్త వేరియంట్ తో వెంటాడుతూనే ఉంది.

కొత్తగా జికా వైరస్ పేరుతో అటాక్ చేయడం ప్రారంభించింది. మొన్నటి వరకు కేరళ, హర్యానాలో కల్లోలం రేపిన జికా వైరస్ తాజాగా ఏపీలోకి చొరబడటం హడలెత్తిస్తోంది. జిల్లాలో ఒక్కసారిగా అధికారులు అలెర్ట్ ఐయ్యారు. నెల్లూరు జిల్లాలో జికా వైరస్ ఇప్పుడు కలకలం రేపింది. మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామంలో ఆరేళ్ళ బాలుడికి జికా వైరస్‌ లక్షణాలు బయటపడ్డాయి. భత్తల సుబ్బారాయుడు అనే పిల్లాడికి జికా వైరస్ సోకినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. తమపరీక్షల్లో వైరస్‌ నిర్ధారణ కాకపోవడంతో బాలుడిని చెన్నైకి తరలించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చింత చెట్టుకు కల్లు !! బ్రహ్మం గారు చెప్పిన వింతే అంటున్న జనం

టోల్‌ మోత.. తిరిగిన ప్రతీసారీ ఎంత కట్టాలో తెలుసా ??

ప్రతి ఇంటి ముందు ఓ కొండముచ్చు ఫ్లెక్సీ.. ఎందుకలా ??

ఏంటి మమ్మి ఇలా ఉన్నారు.. వాట్సాప్‌ ద్వారా బ్యాంకు మేనేజర్‌నే ముంచేశాడు..

సైనికుల ముఖాలను గుర్తుపట్టకుండా కాల్చేస్తున్న పుతిన్‌ సేనలు