కాణిపాకం వినాయకుడికి 6 కేజీల బంగారు బిస్కెట్ల విరాళం

|

Mar 03, 2024 | 5:08 PM

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం వినాయకునికి భారీ విరాళం అందజేశారు ఎన్నారై భక్తులు. రూ.5 కోట్ల విలువ చేసే 20 బంగారు బిస్కెట్లను వరసిద్ధి వినాయకునికి కానుకగా సమర్పించారు. ఈ బంగారు బిస్కెట్లను స్వామివారి అంతరాలయం, బంగారు వాకిలి నిర్మాణానికి ఉపయోగించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఐకా రవి, గుత్తికొండ శ్రీనివాస్‌ అనే ఎన్నారై భక్తులు 6 కేజీల బరువైన బంగారు బిస్కెట్లను స్వామివారికి విరాళంగా అందజేశారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం వినాయకునికి భారీ విరాళం అందజేశారు ఎన్నారై భక్తులు. రూ.5 కోట్ల విలువ చేసే 20 బంగారు బిస్కెట్లను వరసిద్ధి వినాయకునికి కానుకగా సమర్పించారు. ఈ బంగారు బిస్కెట్లను స్వామివారి అంతరాలయం, బంగారు వాకిలి నిర్మాణానికి ఉపయోగించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఐకా రవి, గుత్తికొండ శ్రీనివాస్‌ అనే ఎన్నారై భక్తులు 6 కేజీల బరువైన బంగారు బిస్కెట్లను స్వామివారికి విరాళంగా అందజేశారు. వీరిరువురు కాణిపాకం ఆలయం అభివృద్ధి పనులకు సైతం విరాళాలు అందజేశారు. దాతలిరువురికి ఆలయ అర్చకులు వేద ఆశర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ ఈవో వెంకటేష్‌, చైర్మన్‌ మోహన్‌ రెడ్డి దాతలిరువురిని స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించారు. తీర్ధప్రసాదాలు అంజేసారు .స్వామివారికి భారీ విరాళం అందజేయడం పట్ల ఆలయ అధికారులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అటు స్వామివారి ఆలయ అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరిస్తామని ఇరువురు దాతలు చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కుమారుడి పెళ్లికి వచ్చే అతిథులకు నీతా ఆంబానీ స్పెషల్‌ మెసేజ్‌

పేటీఎం బ్యాంకు కార్యకలాపాల నిలిపివేతకు డెడ్‌లైన్ మార్చి 15

1990తో పోల్చితే నాలుగు రెట్లు పెరిగిన ఊబకాయం !!

పెళ్లిరోజునే భార్యను కడతేర్చిన భర్త.. ఏం జరిగిందంటే ??

మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వాచ్‌మెన్‌