AP News: చూస్తేనే భయమేసేలా భారీ కింగ్ కోబ్రా.. నాగుపామును ఎలా వెంటాడిందో చూడండి!

AP News: చూస్తేనే భయమేసేలా భారీ కింగ్ కోబ్రా.. నాగుపామును ఎలా వెంటాడిందో చూడండి!

Maqdood Husain Khaja

| Edited By: Ravi Kiran

Updated on: Apr 04, 2024 | 10:32 AM

అనకాపల్లి జిల్లాలో ఓ భారీ గిరినాగు హడలెత్తించింది. ఆహారం కోసం వెతుక్కుంటూ మరో పామును వెంబడించింది. పొలంలో బుసలు కొడుతూ వెంటాడింది. శబ్దాలు విని ఆందోళన చెందిన ఆ రైతు భయంతో వణికిపోయాడు. వివరాల్లోకెళ్తే.. స్థానిక మాడుగుల మండలం కాశీపురం గ్రామంలో.. ఆ స్టోరీ ఏంటి ఇప్పుడు తెలుసుకుందామా..

అనకాపల్లి జిల్లాలో ఓ భారీ గిరినాగు హడలెత్తించింది. ఆహారం కోసం వెతుక్కుంటూ మరో పామును వెంబడించింది. పొలంలో బుసలు కొడుతూ వెంటాడింది. శబ్దాలు విని ఆందోళన చెందిన ఆ రైతు భయంతో వణికిపోయాడు. వివరాల్లోకెళ్తే.. స్థానిక మాడుగుల మండలం కాశీపురం గ్రామంలో 12 అడుగుల గిరినాగు కలకలం సృష్టించింది. భవాని అనే రైతు పొలంలో కనిపించింది. ఈ 12 అడుగుల గిరినాగు ఆహారం వెతుక్కుంటూ.. నాగు పాముని వేటాడింది. దాన్ని తినడానికి వెంబడిస్తూ ముందుకు వెళ్లింది. అక్కడే పనిచేస్తున్న రైతులు ఆ భారీ పామును చూసి.. ఆందోళన చెందారు. అక్కడ నుంచి శబ్దాలు రావడంతో భయభ్రాంతులకు గురైన రైతులు.. స్థానిక స్నేక్ క్యాచర్ వెంకటేష్‌కు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్.. 12 అడుగుల గిరినాగును చాకచక్యంగా పట్టుకున్నారు. అక్కడ నుంచి తీసుకెళ్లి.. ఫారెస్ట్ రేంజ్ ఏరియాలో విడిచిపెట్టారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Published on: Apr 04, 2024 10:31 AM