Viral News: చేసిందే తప్పు డెలివరీ, ఆపై ఉచిత సలహా.. జొమాటో తీరుపై మండిపడుతన్న నెటిజన్లు

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటో చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్‌ మీడియా వేదిక ఎక్స్‌లో షేర్‌ చేయగా. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేసిన పనికి చింతిస్తున్నామని చెప్పాల్సింది, ఇలా ఉచిత సలహాలు ఇవ్వడం ఏంటని అంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే....

Viral News: చేసిందే తప్పు డెలివరీ, ఆపై ఉచిత సలహా.. జొమాటో తీరుపై మండిపడుతన్న నెటిజన్లు
Viral News
Follow us

|

Updated on: Oct 17, 2024 | 7:20 AM

ప్రస్తుతం ఫుడ్‌ డెలివరీ యాప్స్‌కు ఎంతటి ఆదరణ లభిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు కేవలం మెట్రో నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ సేవలు ప్రస్తుతం చిన్న చిన్న పట్టణాలకు సైతం విస్తరించాయి. ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టుకునే వారి సంఖ్య పెరుగుతోంది.

ముఖ్యంగా యువత, ఉద్యోగులు ఈ కల్చర్‌కు బాగా అలవాటు పడుతున్నారు. డెలివరీ యాప్స్ మధ్య పెరిగిన పోటీ కూడా ఈ సేవలు విస్తరించడానికి కారణంగా చెప్పొచ్చు. అయితే అంతా బాగానే ఉన్నా కొన్నిసార్లు డెలివరీ యాప్ సంస్థలు వ్యవహరించే తీరు కస్టమర్లకు ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఘటనే హైదరాబాద్‌లో జరిగింది.

ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి జొమాటోలో చికెన్‌ మంచూరియా ఆర్డర్‌ చేసింది. అయితే దీరా ఆర్డర్‌ ఇంటికి వచ్చాక ఓపెన్‌ చేసి చూస్తే అందులో చికెన్‌ మంచూరియాకు బదులుగా చికెన్‌ 65 వచ్చింది. దీంతో వెంటనే ఈ విషయాన్ని జొమాటో కస్టమర్‌ కేర్‌కు మెసేజ్‌ రూపంలో ఫిర్యాదు చేసింది. తాను చికెన్‌ మంచూరియా ఆర్డర్ చేస్తే.. చికెన్‌ 65 వచ్చింది అంటూ మెసేజ్‌ చేసింది సదరు యువతి.

అయితే సమస్యకు పరిష్కారం చూపించాల్సిందో పోగా.. చికెన్‌ 65ని తినమని కోరుతున్నామని, మీకు కచ్చితంగా ఇది నచ్చుతుంది అంటూ జొమాటా నుంచి మెసేజ్‌ వచ్చింది. దీంతో ఒక్కసారి షాక్‌కి గురైన ఆ యువతి.. ఆ చాటింగ్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఇంకేముందు ఈ పోస్ట్‌ కాస్త వైరల్‌ అయ్యింది. జొమాటో తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేసిందో తప్పు, ఆపై ఉచిత సలహాలా.? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..