Viral Video: తల్లి జీబ్రా సాహసం.. సింహాన్ని వెనుక కాళ్లతో తన్నుతూ.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు.!

| Edited By: Phani CH

Nov 08, 2021 | 5:50 PM

తల్లి నుంచి బిడ్డను వేరు చేయడం అసాధ్యం. తన బిడ్డ కష్టాల్లో ఉంటే.. ఏ తల్లైనా చూస్తూ ఊరుకోదు. వాటి నుంచి బిడ్డకు విముక్తి...

Viral Video: తల్లి జీబ్రా సాహసం.. సింహాన్ని వెనుక కాళ్లతో తన్నుతూ.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు.!
Zebra
Follow us on

తల్లి నుంచి బిడ్డను వేరు చేయడం అసాధ్యం. తన బిడ్డ కష్టాల్లో ఉంటే.. ఏ తల్లైనా చూస్తూ ఊరుకోదు. వాటి నుంచి బిడ్డకు విముక్తి లభించేందుకు ఎంతకైనా తెగిస్తుంది. అది తల్లి ప్రేమ. మనుషులలోనైనా, జంతువుల్లోనైనా ఇది ఒకేలా ఉంటుంది. దీనికి అడ్డం పట్టే విధంగా ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన బిడ్డను సింహం నుంచి కాపాడేందుకు ఓ తల్లి జీబ్రా చేసిన పోరాటం నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ జీబ్రాల గుంపు సేద తీరుతున్న సమయంలో ఓ సింహం ఎక్కడ నుంచో గానీ మాటు వేసింది. సమయం దొరికినప్పుడు బలహీనమైన జీబ్రాను మట్టుబెట్టేందుకు సిద్దంగా ఉంది. అయితే ఆ సింహాన్ని గమనించిన జీబ్రాల గుంపు అక్కడ నుంచి పరుగులు పెట్టాయి. అనూహ్యంగా ఓ పిల్ల జీబ్రా సింహం నోటికి చిక్కింది. ఇక తన బిడ్డను సింహం నుంచి రక్షించుకునేందుకు తల్లి జీబ్రా సాహసం చేసింది. సింహంతో యుద్దానికి దిగింది. తన బిడ్డను సింహం నుంచి రక్షించుకోవడమే కాకుండా ఎగిరి.. ఎగిరి.. వెనుక కాళ్లతో తన్నుతూ సింహాన్ని భయపెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోను జంగిల్ సఫారీలో ఓ పర్యాటకుడు తీయగా.. అది కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ 24-సెకన్ల వీడియోను ‘nature27_12’ అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ పోస్ట్ చేసి.. ‘తల్లి తన బిడ్డను కాపాడుకోవడానికి ఎంతటి సాహసమైన చేస్తుంది’ అనే క్యాప్షన్‌ పెట్టారు. దీనికి ఇప్పటిదాకా 2.39 లక్షల వ్యూస్ వచ్చాయి. అలాగే ఈ వీడియో 9 వేల లైకులు సంపాదించింది. దీనిని చూసిన నెటిజన్లు వరుసపెట్టి రీ-షేర్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు.

Also Read:

మొసలిని కనిపెట్టండి చూద్దాం.. అదెక్కడుందో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు.!

T20 World Cup 2021: టీమిండియా సెమీస్ ఆశలు సజీవం.. కానీ అలా జరిగితేనే..

నాగుపాముకు చిక్కిన ఉడుము.. కోబ్రా వేట మాములుగా లేదుగా.. వీడియో చూస్తే హడలిపోతారు.!

ఈ 3 రాశులవారు లక్ష్యాలపై ఏకాగ్రతతో ఉంటారు.. ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు!

 మీరు వాడే వంట నూనెల్లో ఏది ఉత్తమం.! ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోండి..