
లేడీ అఘొరీ బట్టలు లేకుండా తిరగడంతో పాటు.. పోలీసులతో తగాడా పెట్టుకోవడం.. తాగి ఇష్టమొచ్చినట్టు వాగడం దగ్గర నుంచి వర్ణిణి అనే అమ్మాయిని ప్రేమ పేరుతో లేవదీసుకుపోవడం వరకు..! లేడీ అఘోరీ ఎపిసోడ్స్ ఎపిసోడ్స్‌గా తెలుగు టూ స్టేట్స్‌లో సంచనం అవుతూనే ఉం. ఇక ఈ సంచనం చాలదన్నట్టు.. తాజాగా యూట్యూబర్ అన్వేష్ కూడా లేడీ అఘోరీ పై ఓ వీడియో చేశాడు. ఆ వీడియోలో లేడీ అఘోరీ గుట్టు రట్టు చేశారు. ఇంకో మాటలో బట్టలిప్పి మరీ అఘోరీని సోషల్ మీడియాలో నిలబెట్టినంత పని చేశాడు.
ఇక ఈ మధ్యన ప్రపంచ యాత్రను ముగించేసిన అన్వేష్.. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్స్‌పై వీడియోలు చేస్తున్నాడు. వారి బండారాన్ని .. మోసాన్ని బహిర్గతం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే లేడీ అఘోరీగా ఫేమస్ అయిన శ్రీనివాస్ బ్యాకెండ్ స్టోరీ చెబుతూ ఓ వీడియో చేశాడు అన్వేష్.
అఘోరీ అసలు పేరు శ్రీనివాస్ అని.. అతను శ్రీనివాస్ నుంచి.. నాగసాధుగా.. నాగ సాధు నుంచి లేడీ అఘోరీగా ఎలా మారాడన్నది వివరించాడు. కటిక పేదరికంతో మగ్గిపోతున్న శ్రీనివాస్ అలియాస్ లేడీ అఘోరీ.. తన చిన్నతనంలో సైకిల్ తొక్కుతూ.. ప్రమాద వశాత్తు తన ప్రైవేట్ పార్ట్స్‌ను కోల్పోయాడని చెప్పాడు. అంతేకాదు ముల్లు లేని మగవాడు అంటూ చమత్కరించాడు. ముంబయ్‌లోని హిజ్రాలతో చేరిన శ్రీనివాస్.. హిందూ ధర్మాన్ని అడ్డుపెట్టుకుని భారీగా సంపాదించొచ్చు అంటూ ప్లాన్ చేసుకున్నాడని అన్వేష్ వివరించాడు.ఆ ఫ్లాన్లో భాగంగా నాగ సాధు వేషం వేశాడని.. ఆ వేషతోనే గట్టిగా సంపాదించి కార్ కొనుకున్నాడని.. డబ్బు కోసం ఇద్దరు ముగ్గరు అమ్మాయిలను ట్రాప్ చేశాడని ఆరోపించాడు. దాంతో పాటే ఆ పూజలు… ఈ పూజలు అంటూ.. అమాయకుల నుంచి భారీగా డబ్బు దండుకునే వాడన్నాడు.
సోషల్ మీడియాలోనూ ఎంట్రీ ఇచ్చి.. పాపులర్ అయ్యాడని.. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి బ్యాంకు నింపుకున్నాడని చెప్పాడు అన్వేష్. అలా.. అలా.. ఇప్పుడు లేడీ అఘోరీగా మారి తెలుగు టూ స్టేట్స్ మీద పడ్డాడన్నాడు. ఈ క్రమంలోనే వర్షిణి ట్రాప్ చేశాడని చెప్పాడు అన్వేష్. వర్షిణి కూడా డబ్బు కోసమే లేడీ అఘోరీ వెంటే ఉందని ఆమె తీరును కూడా విర్శించాడు. హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకుని.. ఆ ధర్మాన్ని నమ్మేవాళ్లను మోసం చేయడమే శ్రీనివాస్ అలియాస్ లేడీ అఘోరీ పని అంటూ చెప్పాడు. అందుకే శ్రీనివాస్‌ను ఎవరూ నమ్మకండని.. తన వీడియోలో రిక్వెస్ట్ చేశాడు అన్వేష్.
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..