Viral Video: వావ్.. అదిరిపోయింది.. లోకల్ ట్రైయిన్‏లో డ్యాన్స్‏తో మెస్మరైజ్ చేసిన యూత్.. వీడియో చూస్తే ఫిదా అవ్వడం ఖాయం..

ముంబైలోని ఓ లోకల్ ట్రెయిన్‏లో కొందరు యువతీ యువకులు ఆనందంగా డ్యాన్స్ చేశారు.. అందరూ వరుసగా ఒకరి భూజాలపై మరొకరు చేతులు వేసి అక్షయ్ కుమార్, కరీనా కపూర్, ప్రియాంక చోప్రా నటించిన ఐత్రాజ్

Viral Video: వావ్.. అదిరిపోయింది.. లోకల్ ట్రైయిన్‏లో డ్యాన్స్‏తో మెస్మరైజ్ చేసిన యూత్.. వీడియో చూస్తే ఫిదా అవ్వడం ఖాయం..
Viral
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 14, 2022 | 12:50 PM

ప్రస్తుతం చిన్న, పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది సోషల్ మీడియా ప్రపంచంలో మునిగి తేలుతున్నారు. యూట్యూబ్, ఇన్ స్టా, ట్విట్టర్, ఫేస్ బుక్ అంటూ గంటలు గంటలు ఫోన్ చూస్తూ గడిపేస్తున్నారు. ఇక మరీ ముఖ్యంగా ఇన్ స్టా రీల్స్ అంటూ వారు చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. లైక్స్,వ్యూస్ కోసం ఎప్పటికప్పుడు కొత్త పంథాలను ఎంచుకుంటున్నారు. కొందరు ఫేమస్ మూవీ డైలాగ్స్ చెప్పి ఆకట్టుకోగా.. మరికొందరు మాత్రం ప్రాణాలకు తెగించి మరీ సాహసాలు చేస్తుంటారు. అలాగే మరికొందరు పాటలు పాడితే.. ఇంకొందరు అద్భుతంగా డ్యాన్స్ చేసి ఆకట్టుకుంటారు. ఇటీవల వయసుతో సంబంధం లేకుండా రీల్స్ లో స్టెప్పులేసి అదుర్స్ అనిపిస్తున్నారు. తాజాగా కొందరు యువతీ యువకులు ట్రెయిన్ లో చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి నెటిజన్లకు ఆకట్టుకుంటుంది.

ముంబైలోని ఓ లోకల్ ట్రెయిన్‏లో కొందరు యువతీ యువకులు ఆనందంగా డ్యాన్స్ చేశారు.. అందరూ వరుసగా ఒకరి భూజాలపై మరొకరు చేతులు వేసి అక్షయ్ కుమార్, కరీనా కపూర్, ప్రియాంక చోప్రా నటించిన ఐత్రాజ్ చిత్రంలోని గిల గిల గిల దిల్ గిల గిలా పాటకు చూడముచ్చటగా డ్యాన్స్ చేశారు.. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. వీరి డ్యూన్స్ కు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.. ఈ వీడియోను మీరు ఓసారి చూసేయ్యండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.