D-mart: డీమార్ట్‌‌కి వెళ్లిన యువతికి ఎదురైన అవమానవీయ ఘటన.. ఏం జరిగిందంటే

ఉత్తరప్రదేశ్‌ గజియాబాద్‌లోని ఓ డిమార్టులో అవమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ యువతి డిమార్ట్‌లోకి వెళ్లగా తన ట్రోలీ ఇతరుల ట్రోలీని ఢీకొనండతో వాళ్లు ఆమెపై దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే గజియాబాద్‌లోని ఓ యువతి తన స్నేహితురాలితో కలిసి ఉంటూ ఓ ఇంజనీరింగ్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తోంది.

D-mart: డీమార్ట్‌‌కి వెళ్లిన యువతికి ఎదురైన అవమానవీయ ఘటన.. ఏం జరిగిందంటే
D Mart Trolly

Updated on: May 10, 2023 | 9:57 AM

ఉత్తరప్రదేశ్‌ గజియాబాద్‌లోని ఓ డిమార్టులో అవమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ యువతి డిమార్ట్‌లోకి వెళ్లగా తన ట్రోలీ ఇతరుల ట్రోలీని ఢీకొనండతో వాళ్లు ఆమెపై దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే గజియాబాద్‌లోని ఓ యువతి తన స్నేహితురాలితో కలిసి ఉంటూ ఓ ఇంజనీరింగ్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. అయితే కొన్నిరోజుల క్రితం ఆమె సరకులు తెచ్చుకునేందుకు వాళ్లిద్దరు డీమార్ట్‌కు వెళ్లారు. అయితే ఆ యువతి తన ట్రోలీలో వస్తువులు వేసుకుంటుండగా పొరపాటున అది వేరే వాళ్ల ట్రోలీని ఢీకొట్టింది. దీంతో ఓ మహిళ, ఇద్దరు మగవాళ్లు ఆమెతో అనుచితంగా ప్రవర్తించారు. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది.

తను వాళ్లకు క్షమాపణలు చెప్పినప్పటికీ కూడా వాళ్లు ఆమెను కొట్టారని.. చొక్కా పట్టుకుని లాగారని పోలీసుల ముందు వాపోయింది. కానీ మొదట పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ఒప్పుకోలేదు. ఆ తర్వాత సినియార్ అధికారులు జోక్యం చేసుకోవడంతో కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us