Vande Bharat Attack Video: వందే భారత్ రైలు అద్దాలను సుత్తితో పగలగొడుతున్న యువకుడు.. వీడియో వైరల్‌..

|

Sep 10, 2024 | 7:48 PM

వందేభారత్ రైలు అద్దాన్ని సుత్తితో కొట్టిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వినియోగదారులు అంటున్నారు. అయితే ఆ వీడియో ఎక్కడిది అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కానీ, వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దీనిపై ఆగ్రహంగా రియాక్ట్ అవుతున్నారు.

Vande Bharat Attack Video: వందే భారత్ రైలు అద్దాలను సుత్తితో పగలగొడుతున్న యువకుడు.. వీడియో వైరల్‌..
Man Breaking Vande Bharat
Follow us on

ప్రస్తుతం దేశవ్యాప్తంగా రైలు ప్రమాదాలు గణనీయంగా పెరిగాయి. కొన్ని చోట్ల రైళ్లు ప్రమాదాలకు గురవుతుండగా మరికొన్ని చోట్ల పట్టాలు తప్పేలా కొందరు దుండగులు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో దేశంలోని సూపర్ ఫాస్ట్ రైలు వందే భారత్‌పై రాళ్లు రువ్వడం, దాడులు చేయడం సర్వసాధారణమైపోయింది. కాన్పూర్‌లో కాళింది ఎక్స్‌ప్రెస్ రైలును అజ్మీర్‌లో బోల్తా కొట్టించడానికి కుట్ర పన్నారు. కానీ, అది విఫలమైంది. ఈ క్రమంలోనే వందే భారత్ రైలు అద్దాన్ని సుత్తితో పగలగొట్టిన వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిపై ఇంటర్‌నెట్‌ వేదికగా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైరల్ వీడియోలో ఒక వ్యక్తి ప్లాట్‌ఫారమ్‌పై ఆగి ఉన్న వందేభారత్ రైలు కిటికీ అద్దాన్ని సుత్తితో పగుల కొడుతున్నాడు. అయితే రైలు గ్లాస్ బలంగా ఉండడం వల్ల అది పగలలేదు. కానీ, ఆ వ్యక్తి మాత్రం తన శక్తినంతా కూడగట్టుకుని రైలు గ్లాస్‌ను కొట్టడం కనిపిస్తుంది. వీడియోలో ఉన్న వ్యక్తి చుట్టూ ఎవరూ కనిపించడం లేదు. ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియా యూజర్లలో ఆగ్రహం పెరిగింది.

ఇవి కూడా చదవండి

యూపీలోని కానూరు చుట్టుపక్కల వందేభారత్‌పై రాళ్లు రువ్విన ఘటనలు అనేకం ఉన్నాయి. వందేభారత్ రైలు అద్దాన్ని సుత్తితో కొట్టిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వినియోగదారులు అంటున్నారు. అయితే ఆ వీడియో ఎక్కడిది అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కానీ, వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దీనిపై ఆగ్రహంగా రియాక్ట్ అవుతున్నారు.

ఈ వీడియో చూడండి..

మరికొందరు మాత్రం సదరు వ్యక్తి రైల్వే కాంట్రాక్టర్ ఉద్యోగి అని చెబుతున్నారు. ఈ గాజును తొలగించి మరొకటి అమర్చాలని ఆర్డర్ పొందాడని చెప్పారు. ఆ తర్వాత అతను దానిని సుత్తితో పగలగొట్టి, మరొకదాన్ని ఇన్‌స్టాల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఒక వినియోగదారు చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..