కాదేది వైరల్‌కు అనర్హం అన్నట్లు పరిస్థితులు మారిపోయాయి. రెగ్యులర్‌కి కాస్త భిన్నంగా ఉంటే చాలు వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి ఎన్నో ఆసక్తికర వీడియోలకు సోషల్ మీడియా ఇప్పుడు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. తాజాగా ఇలాంటి ఓ ఫన్నీ వీడియో నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంటోంది. గత కొన్ని రోజుల క్రితం ‘సుఖీభవ’ వీడియో నెట్టింట ఎంత హడావుడి చేసిందో స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే ప్రతీ ఒక్కరికీ తెలిసే ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా వైరల్ అవుతోన్న వీడియో.. సుఖీభవ స్టెప్‌ను రీప్లేస్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదనిపిస్తోంది.
పెళ్లి వేడుకల్లో డ్యాన్స్‌లు చేయడం సర్వసాధరణమైన విషయం. ముఖ్యంగా బరాత్‌లలో చేసే డ్యాన్స్‌లు ఆకట్టుకుంటాయి. మద్యం మత్తులో వేసే స్టెప్పులు నవ్వులు పూయిస్తుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ స్టెప్పు నవ్వులు పూయిస్తోంది. వివాహ వేడుకలో కుర్రాళ్ల గ్యాండ్ డ్యాన్స్ చేస్తోంది. ఆ గ్రూప్‌లో నుంచి ఓ కుర్రాడు పక్కకు వచ్చి తనంతట తాను స్వయంగా ఓ స్టెప్ వేశాడు.
చేతిలో గుట్కా వేసుకుంటున్నట్లు నటిస్తూ వెరైటీ స్టెప్ వేశాడు. అయితే నిజంగా చేతిలో గుట్కా వేసుకున్నట్లు మాత్రం కనిపించలేదు. కేవలం ఫన్నీ కోసమే అతను అలాంటి స్టెప్ వేసినట్లు వీడియో చూస్తే అర్థమవుతోంది. ఈ వీడియోను బటర్ ఫ్లై మహి అనే ఇన్‌స్టాగ్రామ్ ఐడీలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నవ్వు ఆపుకోలేక పోతున్నారు. వీడు మాములు కళాకారుడు కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..