ఆరోగ్యం కోసం ఎక్సర్‌సైజ్ చేయడానికి జిమ్‌కి వెళ్తుంటారు.. అక్కడ వర్కవుట్స్ చేసినతర్వాత ఎనర్జీ కోసం జ్యూస్ తాగాలనిపిస్తుంది. ఏ జ్యూస్ షాపులోనో, లేకపోతే ఇంటికి వెళ్లో రెడీగా ఉన్న జ్యూస్‌ని తాగుతారు. కానీ ఇక్కడ ఓ జ్యూస్ షాపు ఉంది. ఇది వెరీ స్పెషల్. ఎందుకంటే అక్కడికి ఎవరు వెళ్లినా వాళ్లు జ్యూస్ చేసి ఇవ్వరు. అక్కడ ఎవరి జ్యూస్ వాళ్లు తయారు చేసుకోవలసిందే. సెల్ఫ్ సర్వీస్ అన్నమాట… ఇందుకోసం ఓ ప్రత్యేకమైన టెక్నాలజీని వాడుతున్నారు ఆ జ్యూస్ షాపు వాళ్లు.. అదేంటో చూద్దాం రండి…
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో… ది గ్రీనోబార్ అనే ప్రత్యేక జ్యూస్ షాప్ ఉంది.ఈ గ్రీనోబార్‌లో చాలా సైకిల్స్ ఉంటాయి. వాటి ముందు చక్రంపై మిక్సీ జ్యూస్ జార్ పెట్టేందుకు వీలుగా ఏర్పాటు చేసి ఉంది. జ్యూస్ కావాలి అనుకునేవారు సైకిల్ ఎక్కి తొక్కాలి. వారు తొక్కుతూ ఉంటే… జార్‌లో జ్యూస్ తయారవుతూ ఉంటుంది. ఎంత వేగంగా తొక్కితే… అంత వేగంగా జ్యూస్ తయారవుతుంది. ఇలా ఎనర్జీ వేస్ట్ అయితే గానీ జ్యూస్ రాదన్నమాట. అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గించుకోవడానికి ఈ కాన్సెప్ట్ ఏర్పాటుచేశారు ఆషాపువాళ్లు. ఎంతైనా కష్టపడి సంపాదించుకున్నది చాలా ఆనందాన్నిస్తుందికదా.. అందుకే ఈ కాన్సెప్ట్ కస్టమర్లకు, నెటిజన్లకూ బాగా నచ్చుతోంది. ఇప్పటివరకూ ఎక్కడా ఇలాంటి జ్యూస్ బార్ లేదు. అందుకే దీనికి సంబంధించిన ఓ వీడియో సూపర్ వైరల్ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో డిసెంబర్ 6న పోస్ట్ చేసిన ఈ వీడియోని కోట్లాదిమంది వీక్షిస్తున్నారు. లక్షల్లో లైక్స్ చేస్తున్నారు. నిజమండీ… ఇందులో మోహిత్ కేశ్వానీ… సైకిల్ తొక్కుతూ… పుచ్చకాయ జ్యూస్ తయారుచేసుకున్నారు. కస్టమర్లు హార్డ్‌వర్క్ చేసి.. కేలరీలు బర్న్ చేసుకొని ఆ తర్వాత జ్యూస్ తాగుతున్నారు. సాధారణంగా జ్యూస్ తయారీకి కరెంట్ అవసరం. ఇక్కడ ఆ అవసరం లేకుండానే జ్యూస్ తయారవుతోంది. ఆరోగ్యానికీ ఇది మేలే కావడం వల్ల నెటిజన్లు దీన్ని బాగా లైక్ చేస్తున్నారు. కొంత మంది ఆ సైకిల్ తమకూ కావాలి అంటున్నారు. మరికొంతమంది జిమ్‌లలో ఇలాంటివి ఏర్పాటు చెయ్యాలని కోరుతున్నారు.
Also Read: రెక్కీ చేసింది అతడే అని ప్రచారం.. రాధాకు చంద్రబాబు ఫోన్