బాబోయ్‌..ఆ రెస్టారెంట్‌లో చికెన్‌ కర్రీ తినాలంటే ఆస్తులమ్ముకోవాల్సిందే..! ప్లేట్‌ మీల్‌ ధర తెలిస్తే..

|

Mar 27, 2025 | 8:45 PM

ఎంపరర్ చికెన్ అని కూడా పిలువబడే ఈ రకమైన చికెన్ దాని ప్రత్యేకమైన రుచి కారణంగా హోటళ్ళు, రెస్టారెంట్లలో స్పెషల్‌గా తయారు చేసిన, అధిక ధరలకు కస్టమర్లకు అందిస్తుంటారు. ఈ రకం కోళ్ల ధర కిలోకు 200 యువాన్లు, అంటే రూ.2,300ల వరకు ఉంటుందని చెబుతున్నారు.

బాబోయ్‌..ఆ రెస్టారెంట్‌లో చికెన్‌ కర్రీ తినాలంటే ఆస్తులమ్ముకోవాల్సిందే..! ప్లేట్‌ మీల్‌ ధర తెలిస్తే..
Chicken Curry
Follow us on

సాధారణంగా కేజీ చికెన్ కర్రీ ధర ఎంత ఉంటుంది..రూ.500 ల నుంచి మహా అయితే, వెయ్యి వరకు ఉంటుంది. కానీ ఒక రెస్టారెంట్‌లో చికెన్ కర్రీ ధర 5 వేలకు పైగానే ఉంది. ఇదే ఇప్పుడు ఇంటర్ నెట్‌ వేదికగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పైగా ఆ రెస్టారెంట్ లో సగం ఉడికిన చికెన్ ను అధిక ధరకు అమ్ముతున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగినప్పుడు రెస్టారెంట్ యజమాని ఇచ్చిన సమాధానం చూసి కస్టమర్లు షాక్‌ అవుతున్నారు. ఈ చికెన్ కర్రీ ఎందుకు అంత ఖరీదైనది..? ఎందుకు అంత ఎక్కువకు అమ్ముతున్నారో పూర్తి వివరాల్లోకి వెళితే…

చికెన్ మీల్ ధర మామూలుగా అయితే, ఓ వెయ్యి రూపాయల వరకు ఉంటుంది. అది కూడా చాలా ఎక్కువే. కానీ చైనాలోని ఒక రెస్టారెంట్‌లో చికెన్ రెసిపీ మీల్‌ ఖరీదు అక్షరాల రూ. 5,500. అవును షాక్‌ అవుతున్నారా..? చైనాలోని షాంఘైలోని ఒక రెస్టారెంట్ సగం ఉడికిన చికెన్‌ను అత్యధిక ధరకు అమ్ముతోంది. పైగా దీనికి ఆ రెస్టారెంట్ యాజమాన్యం ఒక వింత కారణం చెప్పింది. ఈ రెస్టారెంట్‌లో ఇటీవల ఒక కస్టమర్ సగం ఉడికిన చికెన్ కర్రీని కొన్నాడు. దీనికి రెస్టారెంట్ 480 యువాన్లు వసూలు చేసింది. ఈ బిల్లు చూసి వ్యాపారవేత్త ఆశ్చర్యపోయాడు. వెంటనే తనకు ఇచ్చిన బిల్లుపై యజమాన్యాన్ని ప్రశ్నించాడు. ఈ చికెన్ కర్రీని ఇంత ఎక్కువ ధరకు ఎందుకు అమ్ముతున్నారు? మీరు ఈ కోడిని నీళ్ళతో కాకుండా పాలతో పెంచావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఈ ప్రశ్నకు రెస్టారెంట్ యజమాని సమాధానమిస్తూ, అవును, మా కోడి సాంప్రదాయ చైనీస్ సంగీతాన్ని వింటూ పెరిగింది అని సమాధానం ఇచ్చాడు. పైగా ఈ కోడి నీళ్లకు బదులుగా పాలు తాగుతూ పెరిగిందని చెప్పాడు.

ఇవి కూడా చదవండి

రెస్టారెంట్ యజమాని సమాధానం విన్న సదరు కస్టమర్‌ షాక్‌ అయ్యాడు. ఇకపై తాను కూడా ఇలాంటి కోళ్లను స్వయంగా పెంచుతానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విషయం ఇప్పుడు అన్ని సోషల్ మీడియాల ప్లాట్‌ఫామ్‌లపై చక్కర్లు కొడుతోంది. ఈ కోళ్లు సాంప్రదాయ సంగీతం మధ్య, ప్రత్యేక ఆహారం పెడుతూ పెంచుతామని కోళ్ల ఫారమ్ నిర్వాహకుడు చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..