Viral News: ఈ భూమిపై జీవించి ఉన్న కుక్కల్లో ఇదే అతి పెద్దది.. అందుకే గిన్నిస్ బుక్‌లోకి కూడా ఎక్కింది..
Guinness World Records: విశ్వాసానికి మారుపేరుగా నిలిచే కుక్కలకు చాలామంది సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. ఆహారంతో పాటు వాటికి కావాల్సిన అన్ని రకాల సకల సౌకర్యాలను సమకూరుస్తుంటారు.
Guinness World Records: విశ్వాసానికి మారుపేరుగా నిలిచే కుక్కలకు చాలామంది సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. ఆహారంతో పాటు వాటికి కావాల్సిన అన్ని రకాల సకల సౌకర్యాలను సమకూరుస్తుంటారు. అంతేకాదు వాటికి ఏ చిన్న దెబ్బ తగిలినా అల్లాడిపోతుంటారు. కాగా శునకాల సాధారణ జీవిత కాలం సుమారు 10 ఏళ్ల నుంచి 13 ఏళ్లు మాత్రమే. అయితే 21 ఏళ్ల వయసున్న ఓ కుక్క ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ భూమిపై జీవించి ఉన్న అతిపెద్ద వయసు గల శునకంగా ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో (Guinness World Records) స్థానం సంపాదించింది. దానిపేరు చువావా టోబీకీత్ (chihuahuaTobyKeith). మరి అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న ఈ కుక్క గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.
స్పెషల్ ట్రీట్ ఇచ్చి!
ఫ్లోరిడా నగరంలో ఉండే చువావా వయసు సుమారు 21 ఏళ్లు. ఇది 2001 జనవరి 9న జన్మించింది. ప్రస్తుతం దీని వయసు అక్షరాలా 21 ఏళ్ల 97 రోజులు. ఈక్రమంలో భూమిపై జీవించి ఉన్న అతి పెద్ద వయసు గల కుక్కగా ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. దీనికి సంబంధించిన వీడియోను గిన్నిస్ బుక్ యాజమాన్యం తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకుంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక చువావా విషయానికొస్తే.. గ్రీన్‌కర్స్‌కి చెందిన గిసెలా షోర్ ఓ జంతువుల ఆశ్రమం నుంచి టోబీకిత్ ను దత్తత తీసుకున్నారు. ఇంటికి తీసుకొచ్చి జాగ్రత్తగా చూసుకుంటున్నారు. కాగా చువావా గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించడంతో షోర్ సంతోషంలో మునిగితేలుతున్నారు. తమను ప్రపంచానికి పరిచయం చేసినందుకు చువావాను కారులో లాంగ్ జర్నీకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా దానికి ప్రత్యేక ట్రీట్ కూడా ఇచ్చారు.
View this post on Instagram
satna titus: మరో క్రైమ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న అందాల భామ.. వైరల్ అవుతోన్న ఫోటోలు