Funny Viral Video: కెమెరాకు చిక్కిన మహిళ మృతదేహాన్ని వీడిన ఆత్మ వీడియో.. సొంత రిస్క్ తీసుకుని చూడమంటున్న నెటిజన్లు
Funny Viral Video ఒక మహిళ ఆత్మ తన శరీరాన్ని విడిచిపెట్టి కెమెరాలో చిక్కుకున్న వీడియో అంటూ సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది. ఈ వీడియోప్రముఖ ఇన్ స్టాగ్రామ్ పేజీ 'ఘంటా..
Funny Viral Video ఒక మహిళ ఆత్మ తన శరీరాన్ని విడిచిపెట్టి కెమెరాలో చిక్కుకున్న వీడియో అంటూ సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది. ఈ వీడియోప్రముఖ ఇన్ స్టాగ్రామ్ పేజీ ‘ఘంటా’ (Ghantaa)షేర్ చేసింది. ఈ వీడియో 1.4 మిలియన్లకు పైగా వ్యూస్ , 86 వేల లైక్స్ ను సొంతం చేసుకుంది.
ఈ వీడియో ఎడిట్ చేయబడిందని స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాదు.. సరదాగా నవ్వుకోవడం కోసం ఈ వీడియో షేర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ వీడియో క్లిప్ కు గగుర్పాటు కలిగించే నేపథ్య సంగీతం పెట్టారు. ఎరుపు, నీలం రంగు కాంబినేషన్ చీరలో.. ఒక భారతీయ మహిళ శవంలా నేలపై పడుకుని ఉంది. అయితే మృత దేహం కలునులను పెద్దగా తెరచి నేలమీద ఉంది. అయితే ఇంతలో అకస్మాత్తుగా.. మృత దేహం నుంచి ఆమెలా ఉన్న మరొక వ్యక్తి.. మెల్లగా బయటకు వస్తున్నట్లు.. శరీరంలోని ఆత్మ శరీరాన్ని విడిచి పెడుతున్నట్లు కనిపిస్తుంది.
సరిగ్గా నేలమీద పడి ఉన్న స్త్రీలా కనిపించే ఆత్మ.. ఆమె శరీరం నుండి నెమ్మదిగా బయటికి వచ్చి, ఆపై గాలిలో తిరుగుతుంది. అంతేకాదు ఆ స్త్రీ ఆత్మ తన ‘మృత దేహం’ వైపు తిరిగి చూస్తుంది. అనంతరం తన ముందు ఉన్న కెమెరా వైపు చూస్తుంది. అప్పుడు ఆ ఆత్మ నవ్విన నవ్వు భయంకరంగా ఉంది. అయితే ఈ వీడియో చూసేవారు దైర్యం ఉంటేనే చూడాలని.. తమకు ఏ విధమైన సంబంధం లేదని కామెంట్ జత చేసి షేర్ చేశారు.
క్రింద వైరల్ వీడియో చూడండి:
View this post on Instagram
Also Read: Hyderabad: ఆహార ప్రియులకు రంజాన్‌వేళ బంపరాఫర్.. నాన్‌వెజ్ ప్రియులకు పిస్తా హౌస్ బంపర్ ఆఫర్
Note: ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఆత్మ వంటి విషయాలను టీవీ9 ధృవీకరించలేదు..