
ఊరగాయ..అమ్మ, అవకాయ ఎప్పుడూ బోర్ కొట్టదు అనేది చాలా సినిమాల్లో వినిపించే డైలాగ్. కానీ, ఇది సినిమా డైలాగ్ మాత్రమే కాదండోయ్. నిజ జీవితంలోనూ అవకాయది అంతే ప్రత్యేకమైన స్థానం. భోజనంలో ఎన్ని రకాల వంటకాలు ఉన్నప్పటికీ మొదటి ముద్ద అవకాయతో తింటే ఆ రుచే వేరు. ఊరగాయ ఏదైనా సరే.. దాని రుచి భిన్నంగా ఉంటుంది. సాధారణంగా ప్రతి ఒక్కరి ఇళ్లలో ఊరగాయలు ఉంటాయి. కొందరు ఊరగాయతో బిజినెస్ చేస్తుంటారు. కానీ, కొన్ని ఊరగాయలతో లక్షలు, కోట్లు సంపాదించవచ్చునని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అవును, అత్యంత ఖరీదైన ప్రీమియం బ్రాండ్ ది రియల్ డిల్ ఒక అమెరికన్ టీవీ షో కోసం అసాధారణ ఊరగాయను సిద్ధం చేసింది.
ఈ ఊరగాయను చాలా ధనవంతులు తింటారు. కాబట్టి, దీనికి 24 క్యారెట్లు అని పేరు పెట్టారు. ఈ ఊరగాయ నిమ్మకాయలు, మామిడి కాయతో తయారు చేయలేదు. దీనిని క్యారెట్లను చేతితో వివిధ ఆకారాల్లో డైమాండ్ ఆకారాల్లో చెక్కడం ద్వారా తయారు చేస్తారు. ప్రతి ఆకారాన్ని తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది. ఈ ఊరగాయ ముక్కలు దేనికదే ఒక కళాఖండాలుగా ఉంటాయి.
అదనంగా, ఈ ఊరగాయలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పదార్థాలను ఉపయోగించారు. ఇటలీలోని మోడెనా నుండి తెల్ల బాల్సమిక్ వెనిగర్, షాంపైన్ వెనిగర్, స్పెయిన్ నుండి వెనిగర్ డి జెరెజ్ వంటి అరుదైన వెనిగర్‌లను ఇందులో కలుపుతారు. ఒరెగాన్ సముద్రపు ఉప్పు, ఇరానియన్ సుగంధ ద్రవ్యాలు, కుంకుమపువ్వు, ఫెన్నెల్ పుప్పొడి (సువాసనగల మసాలా), ఫ్రెంచ్ మిరపకాయలు, మెక్సికన్ వెనిల్లా బీన్స్ ఉపయోగించారు.. ఇక దీంతో ఈ ఊరగాయ రుచిని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లారు.
దీనిని తయారు చేసి ఎక్కడ విక్రయించరు. ఈ 24 క్యారెట్ల ఊరగాయలను కేవలం ప్రదర్శన కోసం మాత్రమే తయారు చేస్తారు. కొన్నిసార్లు పెద్ద షోలలో మాత్రమే తయారు చేస్తారు. అదేవిధంగా, భారతదేశంలో బీహార్‌లోని గండక్ నదిలో లభించే చేపలతో తయారు చేసిన ఊరగాయలు అత్యంత ఖరీదైనవిగా చెబుతారు. ఈ చేపలు కూడా చాలా అరుదుగా లభిస్తాయి. కాబట్టి, ఈ ఊరగాయలు కూడా అన్ని చోట్ల లభించవు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..