Viral Video: మానవత్వం మరుస్తున్న యువత.. సాటి మహిళ కష్టాన్ని గుర్తించని మీ డిగ్రీ కేవలం కాగితం ముక్క మాత్రమే.. వీడియో వైరల్..

|

Jun 20, 2022 | 8:55 PM

సాధికారిత పోరాడే మహిళలు.. సాటి మహిళ కష్టాన్ని గుర్తించి.. సాయం చేయనప్పుడు.. వారి చదువులు.. నిర్ధకం.. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో మెట్రోలో ప్రయాణిస్తున్న ప్రయాణీకులున్నారు.. వారిలో అధికంగా స్త్రీలే.. అయితే ఓ చిన్నారిని ఒడిలో పెట్టుకు.. ఓ మహిళ మెట్రోలో నేలమీద కూర్చుంది.

Viral Video: మానవత్వం మరుస్తున్న యువత.. సాటి మహిళ కష్టాన్ని గుర్తించని మీ డిగ్రీ కేవలం కాగితం ముక్క మాత్రమే.. వీడియో వైరల్..
Viral Video
Follow us on

Viral Video: చదువు సంస్కరాన్ని ఇతరుల కష్టాన్ని అర్ధం చేసుకుని..సాయం చేసే గుణం ఇవ్వక పొతే.. ఎన్ని చదువులు చదివి.. ఎన్ని డిగ్రీలు సంపాదించా.. ఎంతడబ్బులు సంపాదించినా ఉపయోగం లేదు. ఎందుకంటే.. మనిషిగా సాటి మనిషి పట్ల ఉండాల్సిన కనీస కరుణ లేనప్పుడు.. అటువంటి వారిని చూసి.. ఎవరూ హర్షించరు. ముఖ్యంగా సాధికారిత పోరాడే మహిళలు.. సాటి మహిళ కష్టాన్ని గుర్తించి.. సాయం చేయనప్పుడు.. వారి చదువులు.. నిర్ధకం.. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతుంది.. ఆ వీడియోలో మెట్రోలో ప్రయాణిస్తున్న ప్రయాణీకులున్నారు.. వారిలో అధికంగా స్త్రీలే.. అయితే ఓ చిన్నారిని ఒడిలో పెట్టుకు.. ఓ మహిళ మెట్రోలో నేలమీద కూర్చుంది. ఆ మహిళ చిన్నారి చూసి.. సాటి ప్రయాణీకులు ఒక్కరూ కూడా స్పందించి.. తాము కూర్చుకున్న ప్లేస్ నుంచి లేవలేదు.. తమకు పట్టనట్లు.. కొందరు సెల్ చూస్తూ.. మరికొందరు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో చీర కట్టుకున్న మహిళ తన బిడ్డను తన ఒడిలో పెట్టుకుని మెట్రో ట్రైన్ లో ప్రయాణిస్తుంది. అయితే ఆ మహిళ చంటి బిడ్డను ఒడిలో పెట్టుకుని.. నేలమీద కూర్చుంది. అది చూసి… ట్రైన్ లో  సీట్లపై కూర్చున్న ఏ ఒక్కరి హృదయం కరగలేదు.. తమవి రాతి గుండెలు అనిపించేలా ఏమీ పట్టనట్లు.. కూర్చుని ఉన్నారు.. ఇది ఈ వీడియోలో చూడవచ్చు. చిన్నారితో నేలపై కూర్చున్న ఆ మహిళకు సీటు ఇవ్వడం అవసరమని ఏ ఒక్కరికీ అనిపించలేదు.. ఒక్కరు కూడా ఆ మహిళవైపు దృష్టిని కూడా సారించలేదు.

ఇవి కూడా చదవండి

వీడియో పై ఓ లుక్ వేయండి..:

 

ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఈ వీడియోకి  ‘నీ ప్రవర్తనలో కనిపించకపోతే నీ డిగ్రీ కేవలం కాగితం ముక్క మాత్రమే’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో 7.5 లక్షలకు పైగా వ్యూస్ ని సొంతం చేసుకుంది. కొన్ని వందల మంది కామెంట్ చేశారు.  ఈ వీడియో తీసిన వ్యక్తి.. కావాలంటే ఆ మహిళకు తన సీటు ఇచ్చేవాడు.. ఇలాంటి వ్యక్తులు కేవలం వీడియో తీసి వైరల్ చేయడానికి మాత్రమే పనికివస్తారు.. సంస్కారాలు కుటుంబంలో కనిపిస్తాయి, పాఠశాలల్లో కాదని మరొకరు.. పట్టణ వాతావరణంలో రోజు రోజుకీ మానవత్వం తగ్గుతోందని ఒకరు.. కామెంట్ చేయగా..  ఇది చాలా అవమానకరం, దురదృష్టకరమని.. దీనిని మనమందరం గుర్తుంచుకోవాలంటూ రకరకాలుగా నెటిజన్లు కామెంట్ చేశారు. వీడియోపై వ్యాఖ్యానిస్తూ.. ‘ఈ పరిస్థితి నిజంగా చాలా సిగ్గుచేటు ,, దురదృష్టకరం’ అని కామెంట్ చేశారు..

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..