లోకల్ ట్రైన్‌లో సీటు కోసం ముగ్గురు మహిళల సిగపట్లు సంచలనం రేపింది. ముంబై శివార్లలో జరిగిన ఈ ఘటన జరిగింది. థానే నుంచి పన్వేల్ వెళ్తున్న లోకల్ ట్రేన్‌లో సీట్లు కోసం ముగ్గురు మహిళల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వాగ్వాదం కాస్త ఘర్షణకు దారితీసింది. జుట్టు పట్టుకొని వాళ్లు కొట్టుకున్నారు. ఒకరికొకరు తన్నుకున్నారు. సీట్ల కోసం కొట్టుకున్న మహిళల్లో విద్యావంతులు కూడా ఉండడం అందరిని షాక్‌కు గురిచేసింది. చిన్న విషయంపై వాళ్లు పరిస్థితిని చేజారేదాకా తీసుకొచ్చారు. ముగ్గురిని విడదీసేందుకు తోటి ప్రయాణికులు విశ్వప్రయత్నాలు చేశారు. అయినప్పటికి వాళ్లు వినలేదు. కొంతమంది తోటి ప్రయాణికులకు కూడా గాయాలయ్యాయి. ఇక ఈ గొడవను ఆపేందుకు ప్రయత్నించిన ఓ మహిళా రైల్వే పోలీసుకు గాయలయ్యాయి. కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే తలోజా నివాసి గుల్నాథ్ జుబారే ఖాన్, ఆమె కుమార్తె అంజు ఖాన్, ఆమె పదేళ్ల మనవరాలు రాత్రి 7.30 గంటల సమయంలో థానేలో రైలు ఎక్కారు. కోపర్‌ఖైరానే వద్ద రైలు ఎక్కిన స్నేహా దేవే తుర్భే స్టేషన్‌లో ఖాళీగా ఉన్న సీటులో కూర్చుంది. ఇదే సమయంలో పదేళ్ల చిన్నారిని కూర్చోనివ్వకుండా సీటు లాక్కున్నారని ఆరోపిస్తూజుబారే ఖాన్, అంజుఖాన్ స్నేహదేవేతో వాగ్వాదానికి దిగారు.
మొదట మాటలతో మొదలైన ఈ గొడవ చిలికి చిలికి గాలి వానగా మారిపోయింది. తగ్గేదేలే అన్నట్లు ముగ్గురు జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. తోటి ప్రయాణికులు విడిపించేందుకు ప్రయత్నించినా వినలేదు. పైగా ఈ గొడవ మరింత తీవ్రతరమైంది. రైలు నేరుల్ చేరుకోగానే ఎవరో రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. శారదా ఉగ్లే అనే మహిళా కానిస్టేబుల్ మహిళా కంపార్ట్‌మెంట్‌లోకి వచ్చి ఈ గొడవను ఆపేందుకు ప్రయత్నించింది. దీంతో కొద్దిసేపు నిశ్చబ్ధంగా ఉండిపోయారు ఆ ముగ్గురు మహిళలు. అయితే ఏమైందో తెలియదు కానీ మళ్లీ ముగ్గురు గొడవకు దిగారు. ఈక్రమంలో కొందరి తోటి ప్రయాణికులకు గాయాలయ్యాయి. గొడవను ఆపేందుకు ప్రయత్నించిన మహిళా కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. అనంతరం క్షతగాత్రులను సీవుడ్ స్టేషన్‌లో దింపి ఆస్పత్రికి తరలించారు. కాగా తల్లీకూతుళ్లిద్దరిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 353 (ప్రభుత్వ సేవకుడి పనిని అడ్డుకోవడం) కింద కేసు నమోదు చేశారు. అదేవిధంగా అంజుఖాన్‌ను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఇదెక్కడి గొడవ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Vashi, Navi Mumbai | Few women started hitting each other following dispute over seat, a female staff was injured: S Katare, Senior Police Inspector, Vashi Railway Station, on scuffle b/w 3 women in a local train running from Thane to Panvel, today
(Pic 1:Screengrab;viral video) pic.twitter.com/A6bPR3phhA
— ANI (@ANI) October 6, 2022
मुंबई लोकलमध्ये महिलांची हाणामारी… pic.twitter.com/m8BQHGmBqs
— Datta Lawande (@datta_lawande96) October 6, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..