వామ్మో ఇదేం అలవాటు తల్లీ..! బేబీ పౌడర్‌కు బానిసైన మహిళ.. రోజుకో బాటిల్‌ లాగించేస్తుందట..

|

Jan 09, 2024 | 9:34 AM

ఈ అసాధారణ అలవాటును తన స్నేహితులు, కుటుంబ సభ్యుల నుండి ముఖ్యంగా తన కొడుకు కంట పడకుండా దాచడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పింది. ఎందుకంటే.. తన అలవాటు కారణంగా.. అతను కూడా ఇలాగే, పౌడర్ పట్ల ఇష్టాన్ని పెంచుకుంటాడనే భయంతో దాచిపెడుతున్నానని మహిళ చెప్పింది. ఇంట్లో ఉన్న పౌడర్ బాటిళ్లు వేగంగా ఖాళీ అవుతుండడం చూసి కుటుంబ సభ్యులకు కూడా అనుమానం వచ్చి ఈ అలవాటుతో ఆందోళన చెందుతున్నారు.

వామ్మో ఇదేం అలవాటు తల్లీ..! బేబీ పౌడర్‌కు బానిసైన మహిళ.. రోజుకో బాటిల్‌ లాగించేస్తుందట..
Baby Powder
Follow us on

కొంతమంది వింత వ్యసనాలను పెంచుకుంటారు. కొంతమంది ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా కూడా సిగరెట్, మద్యపానం వంటి అనేక వ్యసనాలకు అలవాటు పడుతుంటారు. ఇలాంటి అలవాట్ల కారణంగా బాధిత కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కానీ, ఒక మహిళ వింత వ్యసనం గురించి విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఓ మహిళ బేబీ పౌడర్ తినేందుకు అలవాటు పడింది. బేబీ పౌడర్ తింటానని మహిళ స్వయంగా తానే అంగీకరించింది. లూసియానాలోని న్యూ ఓర్లీన్స్‌కు చెందిన డ్రెకా మార్టిన్ అనే 27 ఏళ్ల మహిళ తన వింత వ్యసనం గురించి వెల్లడించింది. జాన్సన్ బేబీ పౌడర్ తినే అలవాటు తనకు ఉందని ఆ మహిళ తెలిపింది. ఈ ఏడాది జాన్సన్ బేబీ పౌడర్ కోసం దాదాపు $4,000 (3,32,250.80 Indian Rupee) ఖర్చు చేసినట్లు ఆమె వెల్లడించింది. సాధారణ ఆహారం కంటే పౌడర్ తినడానికి ఇష్టపడతానని మహిళ తెలిపింది.

డ్రేకా మార్టిన్ అనే మహిళ తాను రోజూ 623 గ్రాముల జాన్సన్స్ అలో, విటమిన్ ఇ బాటిల్‌ను ఖాళీ చేస్తానని పేర్కొంది. అది తిన్న తర్వాత తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని ఆ మహిళ చెప్పింది. తనకు బేబీ పౌడర్ తినడం అంటే చాలా ఇష్టమని చెప్పింది. ఇది ఎలాంటి వాసన ఉంటుందో సరిగ్గా అదే రుచి కలిగి ఉంటుందని చెబుతోంది. ఇది తనకు మంచి అనుభూతిని కలిగిస్తుందని, తనను సంతోషపరుస్తుందని అంటుంది. ఇంకేమీ తినడానికి ఇష్టపడని స్థాయికి తాను జాన్సన్‌ పౌడర్‌కు బానిస అయ్యాను అని చెప్పింది. అయితే, జాన్సన్ వారి బేబీ పౌడర్ చర్మం మాత్రమే ఉపయోగించాలి. తినటానికి కాదు అని స్పష్టంగా రాసి ఉంటుంది.

ఈ అసాధారణ అలవాటును తన స్నేహితులు, కుటుంబ సభ్యుల నుండి ముఖ్యంగా తన కొడుకు కంట పడకుండా దాచడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పింది. ఎందుకంటే.. తన అలవాటు కారణంగా.. అతను కూడా ఇలాగే, పౌడర్ పట్ల ఇష్టాన్ని పెంచుకుంటాడనే భయంతో దాచిపెడుతున్నానని మహిళ చెప్పింది. ఇంట్లో ఉన్న పౌడర్ బాటిళ్లు వేగంగా ఖాళీ అవుతుండడం చూసి కుటుంబ సభ్యులకు కూడా అనుమానం వచ్చి ఈ అలవాటుతో ఆందోళన చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..