AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: మెట్రోలో సీటు కోసం మహిళల పోరు.. చెప్పులతో యుద్ధం చేశారు.. వీడియో వైరల్‌

ఈ గొడవ మధ్యలో ఇద్దరూ ఒకరినొకరు చంపేస్తానంటూ బెదిరించుకుంటున్నారు. ఈ సమయంలో, మరొక మహిళ ఆమెను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తుంది. వారిలో ఒకరు మెట్రో సిబ్బందికి కంప్లైట్‌ చేయడం కనిపిస్తుంది.  ఈ గొడవ అచ్చంగా పాత సినిమాలో నీళ్ల కోసం కొట్టుకునే సీన్

Watch: మెట్రోలో సీటు కోసం మహిళల పోరు.. చెప్పులతో యుద్ధం చేశారు.. వీడియో వైరల్‌
Women Fight In Metro
Jyothi Gadda
|

Updated on: Mar 31, 2023 | 3:09 PM

Share

నేటి కాలంలో ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లోని ప్రజలకు మెట్రోలో ప్రయాణించడం సర్వసాధారణమైపోయింది. కానీ ఒకప్పుడు ప్రజలు బస్సు లేదా ఆటో-టాక్సీలో కార్యాలయానికి చేరుకునేవారు. కానీ, అప్పటి నుండి నేటి తరం వరకు కూడా ఒక విషయం ఇప్పటికీ ప్రజల్లో అలాగే కొనసాగుతోంది. అదేంటంటే.. సీటు కోసం పోరు… మెట్రో లేనప్పుడు కూడా ఇదే పెద్ద సమస్యగా ఉండేది. ఈరోజు మెట్రో ఉన్నప్పటికీ ఈ సమస్య ఇంకా అలాగే ఉంది. దీని కోసం చాలాసార్లు ఒకరితో ఒకరు గొడవకు దిగుతున్నారు. ఈ సారి కూడా అలాంటి వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.  ఇందులో ఇద్దరు మహిళలు సీటు కోసం హోరాహోరీ పోరాడుతున్నారు.

మీరు మెట్రోలో ప్రయాణించినట్లయితే మీరు ఒక విషయం గమనించాలి. ఉదయం, సాయంత్రం మెట్రోలో ప్రయాణించేటప్పుడు కూర్చోవడం పక్కన పెడితే, ప్రజలు కనీసం లోపలికి ప్రవేశించడానికి కూడా స్థలం ఉండదు. అలాంటి టైమ్‌లో ఒక స్టేషన్‌లో మెట్రో డోర్‌ తెరుచుకోగానే సీటు కోసం జనం పరుగులు తీయటం ఇప్పుడు వైరల్‌ అవుతున్న వీడియోలో చూడొచ్చు. అంతలోనే ఇద్దరు మహిళలు పోట్లాడుకుంటున్నారు. సీటు కోసం ఇద్దరు మహిళల మధ్య ఈ గొడవ జరుగుతోందని ఈ క్లిప్‌పై వైరల్‌ ప్రచారం జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ ఒక్క నిమిషం నిడివిగల వీడియోలో ఓ మహిళ తన చెప్పులు చేతిలోకి తీసుకుని మరో మహిళ మీదకు దూసుకెళ్లింది. పట్టరాని కోపంతో ఆమె ఎదుటి మహిళపై దాడి చేసింది. ఎదురుగా ఉన్న మహిళ కూడా తన చేతిలో స్టీల్ బాటిల్‌తో ఎదురు తిరిగింది. ఈ గొడవ మధ్యలో ఇద్దరూ ఒకరినొకరు చంపేస్తానంటూ బెదిరించుకుంటున్నారు. ఈ సమయంలో, మరొక మహిళ ఆమెను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తుంది. వారిలో ఒకరు మెట్రో సిబ్బందికి కంప్లైట్‌ చేయడం కనిపిస్తుంది.  ఈ గొడవ అచ్చంగా పాత సినిమాలో నీళ్ల కోసం కొట్టుకునే సీన్ ను తలపించింది.

ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. కాగా, 1.5 లక్షల మందికి పైగా ఈ వీడియోను చూశారు. వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు వారి వారి కామెంట్లు షేర్‌ చేశారు. వీడియోపై వ్యాఖ్యానిస్తూ, “మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు ‘రొమాన్స్’ మరియు ‘రొమాంచ్’ రెండూ ఇప్పుడు కనిపిస్తున్నాయి” అంటూ ఒక వినియోగదారు రాశారు. అదే సమయంలో, సీటు కోసం ఇంతలా పోరాడతారా..? అక్కా..! అంటూ మరోకరు కామెంట్‌ చేశారు. మొత్తానికి సోషల్ మీడియాలో వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్..

Follow Us
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!