AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

viral video: ఏం.. తాగితేనే డ్యాన్స్‌ చేస్తారా? నా ఇష్టం.. ఫన్నీ వీడియో!

Woman dances her heart out in viral video, netizens show funny response: ఇంటర్నెట్ పుణ్యమా అని ఈ మధ్యకాలంలో ఎక్కడ ఏం జరిగినా సెకండ్లలో అందరికీ తెలిసిపోతుంది. ప్రస్తుతం నెట్టింట చీర కట్టులో ఉన్న ఓ మహిళ ప్రపంచాన్ని మర్చిపోయి డ్యాన్స్‌ చేసే వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. ఐతే అది పట్టరాని ఆనందమో, అంతులేని విషాదమో.. మద్యం మత్తు నిషానో తెలియదు కానీ పూనకం వచ్చినట్లు డ్యాన్స్‌ చేస్తున్న ఈ […]

viral video: ఏం.. తాగితేనే డ్యాన్స్‌ చేస్తారా? నా ఇష్టం.. ఫన్నీ వీడియో!
Hilarious Dance
Srilakshmi C
|

Updated on: Mar 14, 2022 | 9:26 PM

Share

Woman dances her heart out in viral video, netizens show funny response: ఇంటర్నెట్ పుణ్యమా అని ఈ మధ్యకాలంలో ఎక్కడ ఏం జరిగినా సెకండ్లలో అందరికీ తెలిసిపోతుంది. ప్రస్తుతం నెట్టింట చీర కట్టులో ఉన్న ఓ మహిళ ప్రపంచాన్ని మర్చిపోయి డ్యాన్స్‌ చేసే వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. ఐతే అది పట్టరాని ఆనందమో, అంతులేని విషాదమో.. మద్యం మత్తు నిషానో తెలియదు కానీ పూనకం వచ్చినట్లు డ్యాన్స్‌ చేస్తున్న ఈ మహిళకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియా (social media)లో విపరీతంగా షేర్‌ అవుతోంది. చుట్టు ఉన్న వాళ్లు కొందరు ఆసక్తిగా ఆమె చేస్తున్న డ్యాన్స్‌ చూస్తూ ఉండగా, మరి కొందరేమో ఫోన్లలో వీడియో తీయడం కనిపిస్తుంది. డ్యాన్స్‌ ఆపమని కుటుంబ సభ్యులు వారిస్తున్నా వినిపించుకోకుండా ఇష్టం వచ్చినట్లు గంతులు వేయడం ఈ వీడియోలో కనిపిస్తుంది. చుట్టూ ఉన్న పరిసరాలను చూస్తుంటే అదొక గ్రామంలా ఉంది. ఈ సంఘటన ఎక్కడ చోటుచేసుకుందో తెలియదు కానీ ఘంఠా అనే యూజర్‌ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియోను చూసిన నెటిజన్లు వేలల్లో ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా లక్షల్లో వీక్షణలు, లైకులు వస్తున్నాయి. దుబాయ్‌కి వెళ్లే ఛాన్స్‌ దొరికిందా ఏంటీ? అని ఒకరు, ఆఫ్‌లైన్‌ ఎగ్జామ్‌ క్యాన్సిల్‌ అయ్యి ఉంటాయండీ! లేకపోతే అంత ఆనందం రానేరాదు.. అని ఇంకొక నెటిజన్‌ సరదాగా కామెంట్ చేశారు. అసలేంజరిగి ఉంటుందో మీరైనా ఊహించగలరా..

View this post on Instagram

A post shared by memes | comedy (@ghantaa)

Also Read:

Knowledge: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎన్ని మురికివాడలున్నాయో తెలుసా? వాటిల్లో ఎంత మంది నివాసం..