Viral News: తెలివి తెల్లారినట్లే ఉంది.. సౌండ్ ఇబ్బందిగా ఉందని రూమ్‌మేట్‌ వెంటిలేటర్‌ ఆపేసిన మహిళ.. చివరికి ఏమైందంటే..

|

Dec 02, 2022 | 11:50 AM

కొందరు చేసే పనులు అసలు తెలివి ఉందా లేదా అన్నట్లు ఉంటాయి. ఇలాంటి పనులతో తమ ప్రాణాల మీదికి తెచ్చుకునే వారు కొందరైతే పక్కన వారికి ప్రాణాలను ఇరకాటంలో పెట్టే వారు మరికొందరు. తాజాగా జర్మనీలో ఓ మహిళ చేసిన పని అచ్చంగా ఇలాగే. తెలిసి చేసిందో తెలియక చేసిందో కానీ ఓ...

Viral News: తెలివి తెల్లారినట్లే ఉంది.. సౌండ్ ఇబ్బందిగా ఉందని రూమ్‌మేట్‌ వెంటిలేటర్‌ ఆపేసిన మహిళ.. చివరికి ఏమైందంటే..
Representative Image
Follow us on

కొందరు చేసే పనులు అసలు తెలివి ఉందా లేదా అన్నట్లు ఉంటాయి. ఇలాంటి పనులతో తమ ప్రాణాల మీదికి తెచ్చుకునే వారు కొందరైతే పక్కన వారికి ప్రాణాలను ఇరకాటంలో పెట్టే వారు మరికొందరు. తాజాగా జర్మనీలో ఓ మహిళ చేసిన పని అచ్చంగా ఇలాగే. తెలిసి చేసిందో తెలియక చేసిందో కానీ ఓ వృద్ధురాలు చేసిన పని మరో మహిళ ప్రాణాల మీదికి తెచ్చింది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. మ్యాన్‌హీమ్ పట్టణంలోని ఓ ఆసుపత్రిలో 72 ఏళ్ల భామ్మ చికిత్స తీసుకుంటోంది. ఇదే సమయంలో పక్కన బెడ్‌పై మరో మహిళ వెంటిలేటర్‌పై ఉన్నారు. అయితే రాత్రి నిద్ర పోతున్న సమయంలో ఆ వెంటిలేటర్‌ శబ్ధం చేయడం సదరు భామ్మకు నచ్చలేదు. డిస్ట్రబ్‌గా ఫీలైందో మరెంటో కానీ దర్జాగా లేచి వెంటిలేటర్‌ ఆఫ్‌ చేసింది. దీంతో సదరు పెషేంట్‌ ఒక్కసారిగా కేకలు వేయడంతో ఆసుపత్రి సిబ్బంది వచ్చి వెంటిలేటర్‌ను తిరిగి ఆన్‌చేసి భామ్మను మందలించి వెళ్లిపోయారు.

అయితే ఆ భామ్మ అంతటితో ఆగలేదు మళ్లీ సాయంత్రం వెంటిలేటర్‌ను ఆఫ్‌ చేసింది. దీంతో కోపోద్రిక్తులైన ఆసుపత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు సదరు భామ్మను అరెస్ట్‌ చేశారు. ఒక వ్యక్తి ప్రాణంతో చెలగాటమాడిన కారణంగా ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. బుధవారం ఆ భామ్మను కోర్టు ముందు హాజరుపరిచారు. ఇదిలా ఉంటే వెంటిలేటర్‌ తొలగించబడిన మరో మహిళ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..