Trending Video: ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకర్షిస్తున్న కార్లలో టెస్లా కార్ ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇక ఈ టెస్లా కార్ అనేది ప్రెటోల్ వెహికిల్ కాదని, అది ఒక ఈవీ కార్ అని దాదాపుగా అందరికీ తెలుసు. అయితే టెస్లా కార్‌కి పెట్రోల్ నింపాలని ప్రయత్నించింది ఓ మహిళ. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. ఇక ఆ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ తమ త అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో.. గ్యాస్ ఫిల్లింగ్ కోసమని టెస్లా కార్ ఒకటి గ్యాస్ స్టేషన్ ముందు వచ్చి ఆగింది. అక్కడ స్టాఫ్‌గా ఉన్న ఓ మహిళ వచ్చి ఆ కార్‌కి పెట్రోల్ నింపే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆమె పెట్రోల్ ట్యాంక్ ఎక్కడ ఉందో తెలియక ఆ కారు చుట్టూ తిరిగింది. అయినప్పటికీ ఫ్ల్యుయల్ ట్యాంక్ ఎక్కడా కనిపించకపోవడంతో పెట్రోల్ ఎలా కొట్టాలా అని ఆలోచిస్తూ నిలబడింది. ఆమెను గమనించిన ఓ వ్యక్తి తన దగ్గరకు వచ్చి ఇది పెట్రోల్ కారు కాదని.. ఎలక్ట్రిక్ వెహికిల్ అన్నట్లుగా చెప్పడంతో ఆ అమ్మాయి తెగ సిగ్గుపడిపోతుంది. అందుకు సంబంధిన సన్నివేశాన్ని అక్కడే ఉన్న మరో వ్యక్తి కెమెరాలో బంధించి, నెట్టింట పోస్ట్ చేశాడు.
— NO CONTEXT HUMANS ? (@HumansNoContext) May 6, 2023
కాగా, ఈ వీడియో ఈ నెల 7న సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. NO CONTEXT HUMANS అనే ట్విట్టర్ ఖాతా నుంచి షేర్ అయిన ఈ వీడియోకు ఇప్పటివరకు 11 లక్షలకు పైగా వీక్షణలు, 50 వేలకు పైచిలుకు లైకులు వచ్చాయి. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. అందులో ఆమె తప్పులేదని, అలవాటులో పొరపాటుగా అలా జరిగి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇంకా కొన్ని అలవాట్లను తొందరగా వదిలేయలేమని కొందరు, ఆమె నిజంగా ఓ లెజెండ్ అని మరికొందరు రాసుకొచ్చారు. ఇలా పలువురు నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..