ఈ సాంకేతిక యుగంలో, మితిమీరిన సోషల్ మీడియా ప్రపంచంలో ఆనాటి ప్రేమలు సమసిపోతున్నాయి. నేటి కాలం ప్రేమలు దారుణాలకు దారితీస్తు్న్నాయి. ప్రేమ పేరుతో మోసాలు, హత్యలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి క్రూరమైన వ్యక్తుల మధ్యలో కూడా ఇలాంటి ప్రేమికులు ఉంటారనేది నమ్మలేని నిజం. ఓ భర్త తన భార్య పట్ల చూపుతున్న ప్రేమకు ఇక్కడి బస్టాపే సాక్ష్యంగా నిలుస్తోంది. ఇక్కడ ఒక భార్య భర్తలకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఆ జంటపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఓ వ్యక్తి తన భార్యతో కలిసి బస్ స్టేషన్‌లో ఎదురు చూస్తున్నాడు. బస్ రావడానికి సమయం ఉండటంతో.. అలసిపోయిన భార్య.. అలా భర్త ఒడిలో సేద తీరుతోంది. భర్త కూడా నొచ్చుకోలేదు. భార్యపై ఉన్న ప్రేమ, అభిమానంతో ఆమెను నిద్రపుచ్చాడు. తలపై చేతితో నిమురుతూ, చంటి బిడ్డను చూసుకున్నట్లే భార్యను చూసుకుని, తన గొప్ప ప్రేమను చాటుకున్నాడు. అతనికి కూడా నిద్ర వస్తున్నప్పటికీ, భార్యను హాయిగా పడుకోబెట్టాడు. భార్య పట్ల భర్త గుండెల నిండా ఉన్న ఆ ప్రేమకు ప్రేమికులు, నెటిజన్లు హాట్యాఫ్ చెప్తున్నారు.
हमसफर वही जो हर सफर में आपके साथ हो ❤️? pic.twitter.com/QbyVbZi4AE
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 19, 2022
ఈ వీడియో కర్ణాటకకు చెందిన గుర్తు తెలియని రైల్వే స్టేషన్‌లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 57 వేల మంది వీక్షించారు. వీరి ప్రేమ గొప్పది అని చాలా మంది తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ట్విటర్‌లో షేర్ చేసిన ఈ వీడియో క్లిప్‌లో ఒక మహిళ తన భర్త ఒడిలో తల పెట్టుకుని హాయిగా నిద్రిస్తున్నట్లు చూడొచ్చు. అతడు కూడా ఆమె తలను ఆప్యాయంగా తట్టడం, స్త్రీ నిద్రపోయే సమయంలో ఇబ్బంది పడకుండా చూసుకోవడం చూడవచ్చు. జీవిత ప్రయాణంలో నిజమైన సహచరుడు మీ పక్కన ఉంటాడు అనే క్యాప్షన్‌తో ఈ వీడియో షేర్ చేయబడింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి