21 ఏళ్ల యువతి తీవ్రమైన కడుపునొప్పి, తరచూ వాంతులవుతుండటంతో స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. ఆమెకు అక్కడున్న డాక్టర్లు టెస్టులు చేయగా.. CT స్కాన్‌లో వెల్లడయిన విషయం చూసి దెబ్బకు షాక్ అయ్యారు. ఆమె పొట్ట, పేగుల్లో నల్లటి ఆకారం చుట్టుకుని కనిపించింది. ఇంతకీ అదేంటి.? అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
ఇది చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌తో హోటల్ రూమ్‌కు.. తెల్లారేసరికి సీన్ ఇది.. అసలేం జరిగిందంటే
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఓ యువతి(21) పొట్టలో నుంచి డాక్టర్లు 2 కిలోల జుట్టును ఆపరేషన్ ద్వారా తొలగించారు. 16 ఏళ్లుగా సదరు యువతి తన జుట్టును తానే పీకేసి తినేస్తోందని తెలిపారు. వైద్య పరిభాషలో దీన్ని ట్రికోఫేగియా లేదా రపంజెల్ సిండ్రోమ్‌గా పిలుస్తారని డాక్టర్లు చెప్పారు. పొట్టలోపల మొత్తం మాత్రమే కాకుండా పేగుల్లోకి కూడా జుట్టు చుట్టుకుందని పేర్కొన్నారు. సదరు యువతికి తీవ్రమైన కడుపునొప్పి, తరచూ వాంతులవుతుండటంతో గత నెల 20వ తేదీన పరీక్షలు చేయించేందుకు స్థానిక జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబసభ్యులు. అక్కడున్న వైద్యులు ఆమెకు CT స్కాన్ చేయడంతో అసలు విషయం బయటపడింది.
‘ట్రికోఫేగియా అనేది దీర్ఘకాలిక మానసిక రుగ్మత. ఈ సమస్యతో బాధపడేవారు తమ జుట్టును తామే పీకేసి తినేస్తుంటారు’ అని సర్జరీ చేసిన డాక్టర్ ఎంపీ సింగ్ వివరించారు. ఆ యువతి ఐదేళ్ల వయస్సు నుంచి రహస్యంగా తన జుట్టును తానే తినేస్తోందని తెలిపారు. ఆమెకు సెప్టెంబర్ 26న శాస్త్రచికిత్స నిర్వహించిన 2 కేజీల పెద్ద హెయిర్‌బాల్‌ను తొలగించామన్నారు. కాగా, ఆపరేషన్ అనంతరం బాధితురాలి ఆరోగ్యం కుదుటపడింది. ప్రస్తుతం ఆమె తన మానసిక రుగ్మతకు ఆస్పత్రిలోనే కౌన్సిలింగ్ తీసుకుంటోందని డాక్టర్ ఎంపీ సింగ్ స్పష్టం చేశారు.(Source)
ఇది చదవండి: ఇలా ఉన్నారేంట్రా.! ప్రీ వెడ్డింగ్ షూట్‌లో పని కానిచ్చేశారు.. ముద్దులతో రచ్చోభ్య:
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..