Viral Video: సహనం కోల్పోయిన మహిళ విమానాశ్రయంలో రచ్చ రచ్చ చేసింది.. ఇంతకు ఏమైందంటే

|

Nov 08, 2022 | 8:22 PM

కొంతమంది ఓపిక నశించి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Viral Video: సహనం కోల్పోయిన మహిళ విమానాశ్రయంలో రచ్చ రచ్చ చేసింది.. ఇంతకు ఏమైందంటే
Woman
Follow us on

కొంతమంది మనుషులు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఒక్కసారిగా సహనాన్ని కోల్పోయిన గందర గోళాన్ని సృష్టిస్తూ ఉంటారు. ఇప్పటికే కొంతమంది ఓపిక నశించి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తన ఫ్లైట్ మిస్సవడంతో విసుగు చెందిన ఓ మహిళ తన తోటి ప్రయాణికులపై దాడి చేసింది. అంతే కాదు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై హింసాత్మకంగా ప్రవర్తించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తోటి ప్రయాణికులపై సూట్‌కేస్‌ విసిరేసింది.

ఈ వైరల్ వీడియోలో ఓ మహిళ మెక్సికో సిటీ ఎయిర్‌లైన్ చెక్-ఇన్ డెస్క్ ,సిబ్బందిపై దాడి చేయడాన్ని చూడవచ్చు. 10 సెకన్ల నిడివిగల వీడియోలో కోపంతో ఉన్న మహిళ అరవడం, వస్తువులు విసరడం, కంప్యూటర్‌ని ధ్వంసం చేయడం వంటివి చూడవచ్చు..

ఇవి కూడా చదవండి

అయితే ఈ మహిళ విమానాశ్రయానికి ఆలస్యంగా వచ్చింది.. అలాగే గడువు ముగిసిన పాస్‌పోర్ట్‌తో చెక్ ఇన్ చేయడానికి ప్రయతించింది. ఈ రెండు కారణాల వల్ల ఆమె ప్రయాణం క్యాన్సిల్ అయ్యింది. దాంతో ఆమె ఒక్కసారిగా కోపంతో సిబ్బందితో గొడవకు దిగింది. ఆ తర్వాత పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు, భద్రతా సిబ్బంది అక్కడికి వచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..