వార్నీ ఇలా కూడా ఉంటారా..? ఆన్‌లైన్‌లో పిజ్జా ఆర్డర్‌ చేసిన మహిళ..! కస్టమర్లూ కళ్లు తెరవాలంటూ చేసిన పోస్ట్‌ వైరల్‌..

|

May 08, 2023 | 10:17 AM

ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసి తెప్పించుకున్న పిజ్జా సైజును కొలిచింది. దాంతో ఆన్‌లైన్ పిజ్జా అసలు రహస్యం బయటపడింది. దీంతో ఆమె ఆ ఫిజ్జా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేస్తూ తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు. దీంతో ఈ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు సైతం భిన్నమైన రీతిలో స్పందిస్తున్నారు.

వార్నీ ఇలా కూడా ఉంటారా..? ఆన్‌లైన్‌లో పిజ్జా ఆర్డర్‌ చేసిన మహిళ..! కస్టమర్లూ కళ్లు తెరవాలంటూ చేసిన పోస్ట్‌ వైరల్‌..
Pizza
Follow us on

మనలో చాలా మంది ఆన్‌లైన్‌లో వస్తువులను ఆర్డర్ చేస్తుంటారు. బట్టల నుండి కూరగాయలు, పండ్లు, బిస్కెట్లు, చాక్లెట్లు, పిజ్జా, బర్గర్ల వరకు ఆన్‌లైన్‌ ఆర్డర్‌ ద్వారా తెప్పించుకుంటారు.అయితే ఆర్డర్ అందుకున్న తర్వాత కూరగాయలను తూకం వేయడం లేదా పిజ్జా పరిమాణం కొలవడం మీరు ఎప్పుడైనా చూశారా? వినడానికి విడ్డూరంగా అనిపించినప్పటికీ ఒక మహిళ ఇలానే చేసింది. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసి తెప్పించుకున్న పిజ్జా సైజును కొలిచింది. దాంతో ఆన్‌లైన్ పిజ్జా అసలు రహస్యం బయటపడింది. దీంతో ఆమె ఆ ఫిజ్జా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేస్తూ తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు. దీంతో ఈ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు సైతం భిన్నమైన రీతిలో స్పందిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

Margherita Pizza ఫోటోను Twitter వినియోగదారు Shubhi Bhatia (@shubhibhatia03) మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ఏప్రిల్ 8న పోస్ట్ చేసారు. దాని శీర్షికలో, అతను ఇలా వ్రాశాడు – నేను 10 అంగుళాల పిజ్జాను ఆర్డర్ చేసాను, వారు నాకు 8 అంగుళాల పిజ్జాను పంపారు. పిజ్జా పైన ఒక స్కేల్ (ఇంచ్ టేప్) కూడా పెట్టి కొలిచినట్టుగా మనకు ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది. ఫోటోలో పిజ్జా సైజు ఎంతుందో కూడా మనకు తెలుస్తుంది. నిజానికి తాను 10 అంగుళాల పిజ్జాను ఆర్డర్ చేశానని ట్విట్టర్‌లో పేర్కొంది. కానీ ఆ పిజ్జా వచ్చినప్పుడు, ఆమె సంతృప్తి కోసం టేపుతో కొలిచి ఆశ్చర్యపోయింది. ఎందుకంటే పిజ్జా పూర్తిగా 2 అంగుళాలు తక్కువగా ఉంది. దాంతో తీవ్ర ఆగ్రహనికి గురైన మహిళ పిజ్జా ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో విషయం వైరల్ అయ్యింది. కస్టమర్లు మేల్కొనండి అంటూ ట్విట్టర్‌ వినియోగదారులు కొందరు చెబుతుండగా, ఇలా ఎవరు కొలిచి చెక్‌ చేస్తారండీ అంటూ మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఏదేమైనప్పటికీ వార్తమాత్రం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. మహిళ చేసిన ట్విట్‌కు ఇప్పటికే 89 వేలకు పైగా వ్యూస్, వేల సంఖ్యలో లైకులు వచ్చాయి. మహిళ పిజ్జా కొలిచే ఆలోచన కొంతమందికి నచ్చగా, మరికొందరు ఫన్నీ కామెంట్స్ చేయడం ప్రారంభించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..