AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video: ఇదేందయ్యా.! నూడిల్స్‌ను ఇలా కూడా చేస్తారా.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు.!

Viral Video: సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలను చూస్తుంటాం. అందులో విషయం ఉన్నది చిన్నదే అయినా క్షణాల్లో వైరల్‌గా మారుతుంది…

Funny Video: ఇదేందయ్యా.! నూడిల్స్‌ను ఇలా కూడా చేస్తారా.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు.!
Food Prepare
Ravi Kiran
|

Updated on: Jul 28, 2021 | 9:32 PM

Share

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలను చూస్తుంటాం. అందులో విషయం ఉన్నది చిన్నదే అయినా క్షణాల్లో వైరల్‌గా మారుతుంది. కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని చూడటానికి క్యూట్‌గా.. పొట్ట చెక్కలయ్యేలా నవ్వు తెప్పిస్తాయి. అలాంటి ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇందులో నూడిల్స్ చేసే అమ్మాయి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఆమె చేసిన పనికి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. అదేంటో చూసేద్దాం పదండి!

సాధారణంగా రోడ్డు సైడ్ నూడిల్స్‌ను పెద్ద బాండీలో వేసి చేస్తుంటారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ యువతి దానికి కొంచెం స్వాగ్ యాడ్ చేసింది. నూడిల్స్ చేస్తూనే.. డ్యాన్స్ మూమెంట్స్‌తో ఆ బాండీని అటూ.. ఇటూ.. గిరగిరా తిప్పింది. అక్కడ చేరిన జనం.. ఆ బాండీ ఎక్కడ తమమీద పడుతుందో అని భయపడినా.. ఆమె చేసిన స్టైల్‌కు ఫిదా అయ్యారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు దానిపై మీరు కూడా ఓ లుక్కేయండి.!

కోడలా మజాకా.. అత్తగారిపై ప్రేమతో ఏకంగా 60 రకాల వంటకాలు..

ఓ కోడలు తన అత్తగారికి ఎంతో ప్రేమగా ఆమె పుట్టినరోజు నాడు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి షాక్ ఇచ్చింది. సదరు కోడలు తన అత్తగారి పుట్టిన రోజును రకరకాల వంటలతో ఘనంగా నిర్వహించింది. అత్తగారికి 60వ పుట్టిన రోజు సందర్భంగా 60 రకాల వంటకాలను తయారు చేసి బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చి సర్‌ప్రైజ్ చేసింది.

పులిహోర, కట్టుపొంగలి, కొబ్బరి రైస్‌, గారెలు, పెసరట్టు, మినపట్టు, కేరట్‌ ఇడ్లీ, దద్దోజనం, సేమియా పులిహోర.. ఇలా 60 రకాల వంటకాలతో అత్తగారిని ఆశ్చర్యపరిచింది. పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఆసక్తికర ఘటన అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అత్తగారికి బర్త్ డే గిఫ్ట్‌ అంటూ నెట్‌లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. అత్తగారికి అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చారంటూ కోడలిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read:

దేశంలోని ఈ ఐదు ప్రదేశాల్లో లెక్కలేనన్ని నిధులు.. ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు..

ఈ వైరల్ ఫోటోలో పాము ఉంది.? అదెక్కడో గుర్తించండి చూద్దాం..!

రెండేళ్లుగా ఒక్క టెస్టూ ఆడలేదు.. ఇంగ్లాండ్‌లో సెంచరీ బాదేశాడు.. ఆ టీమిండియా ప్లేయర్ ఎవరంటే!

మద్యం మత్తులో దారుణం.. పెట్రోల్‌ పోసి యువకుడి హత్య!
మద్యం మత్తులో దారుణం.. పెట్రోల్‌ పోసి యువకుడి హత్య!
వాలెంటైన్స్ డే.. భారీగా హోటల్‌ రూమ్‌ బుకింగ్స్‌!
వాలెంటైన్స్ డే.. భారీగా హోటల్‌ రూమ్‌ బుకింగ్స్‌!
టీమిండియా వరల్డ్ రికార్డ్.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ సంచలనం
టీమిండియా వరల్డ్ రికార్డ్.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ సంచలనం
ఓటీటీలో రవితేజ సంక్రాంతి హిట్ సినిమా.. ' స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఓటీటీలో రవితేజ సంక్రాంతి హిట్ సినిమా.. ' స్ట్రీమింగ్ డేట్ ఇదే
ప్రేమపెళ్లి చేసుకుని తప్పుచేశా.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి సూసైడ్
ప్రేమపెళ్లి చేసుకుని తప్పుచేశా.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి సూసైడ్
టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ బైక్‌లు, స్కూటర్లు.. ధర ఎంతో తెలుసా?
టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ బైక్‌లు, స్కూటర్లు.. ధర ఎంతో తెలుసా?
జీతాల పెంపు కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్‌!
జీతాల పెంపు కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్‌!
హోమ్‌వర్క్‌ చేయలేదనీ.. 2వ తరగతి పిల్లాడిని చితకబాదిన టీచర్‌!
హోమ్‌వర్క్‌ చేయలేదనీ.. 2వ తరగతి పిల్లాడిని చితకబాదిన టీచర్‌!
కేవలం 300 సెకన్లలో రూ.2700 కోట్ల చారిత్రాత్మక డీల్ చేశారట..!
కేవలం 300 సెకన్లలో రూ.2700 కోట్ల చారిత్రాత్మక డీల్ చేశారట..!
కొత్త ఆదాయపు పన్ను చట్టం రూల్స్‌ డ్రాప్ట్‌ రిలీజ్‌!
కొత్త ఆదాయపు పన్ను చట్టం రూల్స్‌ డ్రాప్ట్‌ రిలీజ్‌!