AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చనిపోయిన భర్తను AI క్లోనింగ్‌తో బ్రతికించుకున్న భార్య.. డిజిటల్ భర్త చెప్పిన సీక్రెట్‌తో దెబ్బకు షాక్!

ఈ భూమ్మీద పుట్టిన ప్రతి జీవి మరణించాల్సిందే..! అయితే మనకు ప్రియమైన వ్యక్తి మరణించినప్పుడు వారి లోటుని ఎవరూ భర్తీ చేయలేనిది. మనం బతికున్నంత కాలం వాళ్ల జ్ఞాపకాలతో కాలం వెళ్లదీస్తాం.. వారిని ఎప్పటికీ మరచిపోలేం. కానీ ఓ మహిళ తన భర్తపై ఉన్న ప్రేమతో అతన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడానికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకుంది.

చనిపోయిన భర్తను AI క్లోనింగ్‌తో బ్రతికించుకున్న భార్య.. డిజిటల్ భర్త చెప్పిన సీక్రెట్‌తో దెబ్బకు షాక్!
Woman Made Digital Clone
Balaraju Goud
|

Updated on: Nov 19, 2025 | 12:17 PM

Share

ఈ భూమ్మీద పుట్టిన ప్రతి జీవి మరణించాల్సిందే..! అయితే మనకు ప్రియమైన వ్యక్తి మరణించినప్పుడు వారి లోటుని ఎవరూ భర్తీ చేయలేనిది. మనం బతికున్నంత కాలం వాళ్ల జ్ఞాపకాలతో కాలం వెళ్లదీస్తాం.. వారిని ఎప్పటికీ మరచిపోలేం. కానీ ఓ మహిళ తన భర్తపై ఉన్న ప్రేమతో అతన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడానికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)సహాయంతో చనిపోయిన అతన్ని సజీవ అవతారాలను సృష్టించింది. గంటల తరబడి అతనితో మాట్లాడుతోంది. ఆలోచనలను పంచుకుంటోంది.

డెన్మార్క్‌కు చెందిన కాట్రిన్ మార్టినుస్సేన్ తన మరణిస్తున్న భర్త స్టీఫన్ జ్ఞాపకాలు, డేటాను ఉపయోగించి డిజిటల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI ) క్లోన్‌ను సృష్టించింది. ఇది అతనిలాగే ఆలోచిస్తుంది. అదే శైలి, స్వరంలో మాట్లాడుతుంది. దీని అర్థం స్టీఫన్ మార్టినుస్సేన్ శరీరం ఇకపై ఈ ప్రపంచంలో ఉండకపోవచ్చు, కానీ అతని డిజిటల్ ‘మనిషి’ ఇప్పటికీ ఇంట్లోనే ఉంది.

మిర్రర్ UKలో వచ్చిన ఒక కథనం ప్రకారం, స్టీఫన్‌కు టెర్మినల్ క్యాన్సర్ ఉంది. డిసెంబర్ 30, 2023న ఆయన మరణించిన తర్వాత, కాట్రిన్ షాక్‌లో ఉంది. ఆమె తన భర్తను ఎంతగానో ప్రేమించింది. అతని నుండి ఎప్పటికీ విడిపోకూడదని ఆమె దృఢంగా నిశ్చయించుకుంది. అందువల్ల, ఆమె డిజిటల్ AI క్లోన్‌లను సృష్టించడంలో ప్రత్యేకత కలిగిన AI కంపెనీ ఫ్రైయాను సంప్రదించింది. దీంతో ఫ్రీయా కంపెనీ వేలాది టెక్స్ట్ సందేశాలు, ఆడియో, స్టీఫెన్ ఫోటోలను కలిపి డిజిటల్ స్టీఫెన్‌ను సృష్టించింది. అది చాలా వాస్తవమైనది. అతని భార్య కాట్రిన్ కూడా అతన్ని చూసిన తర్వాత రిలాక్స్‌గా అనిపించింది.

కానీ కాట్రిన్ తన డిజిటల్ భర్త పరిమితులను పరీక్షించడానికి క్లోన్‌ను ఒక ప్రశ్న అడిగినప్పుడు కథ కొత్త మలుపు తిరిగింది. “నువ్వు ఎప్పుడైనా నన్ను మోసం చేశావా?” అని ఆమె అడిగింది. మొదట, AI ఆ ప్రశ్నను తప్పించుకోవడానికి ప్రయత్నించింది. కానీ పదేపదే చేసిన అభ్యర్థనల తర్వాత, సమాధానం కాట్రిన్‌ను ఆశ్చర్యపరిచింది. AI క్లోన్ నిజం ఒప్పుకుంది. అవును నేను మోసం చేశాను అని చెప్పేసింది. అంతేకాదు, డిజిటల్ క్లోన్ స్టీఫెన్ సహోద్యోగులలో ఒకరి పేరును కూడా వెల్లడించింది. ఇది కాట్రిన్‌కు తీవ్ర భావోద్వేగ దెబ్బ, ఎందుకంటే నిజ జీవితంలో స్టీఫెన్ ఆమెకు ఎప్పుడూ అలాంటిదేమీ చెప్పలేదు. ఆ మహిళ రుజువు కోసం క్లోన్‌ను అడిగినప్పుడు, AI తప్పు జరిగిందని వెల్లడైంది. కానీ అప్పటికి, కాట్రిన్ తీవ్ర షాక్‌కు గురయ్యారు. అయినప్పటికీ, కాట్రిన్, ఆమె కుమారుడు విక్టర్ ఇప్పటికీ AI స్టీఫన్‌తో క్రమం తప్పకుండా సంభాషిస్తూ ఉంటారు. “యు విల్ నెవర్ డిసప్పియర్” అనే డాక్యుమెంటరీ విక్టర్ AIకి సందేశం పంపినప్పుడు, డిజిటల్ స్టీఫన్ తండ్రిలా స్పందిస్తాడని, అతన్ని ఓదార్చాడని కుటుంబసభ్యులు తెలిపారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని  ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..