Six Babies: గంట వ్యవధిలో ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చిన యువతి.. గాడ్ మిరాకిల్ అంటున్న నెటిజన్లు

జీనత్‌కి ఇది మొదటి డెలివరీ కాగా ఏప్రిల్ 18న ఆమెకు ప్రసవ నొప్పులు వచ్చాయి. కుటుంబసభ్యులు ఆమెను రావల్పిండిలోని జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. ఆ తర్వాత  అదే రోజున గంట వ్యవధిలో జీనత్ ఒకరి తర్వాత ఒకరుగా ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఆరుగురు శిశువులు రెండు పౌండ్ల కంటే తక్కువ బరువుతో ఉన్నారని, పిల్లలందరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

Six Babies: గంట వ్యవధిలో ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చిన యువతి.. గాడ్ మిరాకిల్ అంటున్న నెటిజన్లు
6 Babies In An Hour In Pakistan
Image Credit source: X

Updated on: Apr 22, 2024 | 8:09 PM

ఒకే సమయంలో కవలలు పుట్టడం సర్వసాధారణం. అరుదైన సందర్భాల్లో మాత్రమే ఒకే సమయంలో ముగ్గురు, నలుగురు పిల్లలు జన్మించిన వార్తలు వింటూ ఉంటారు. అయితే ఇపుడు ఓ యువతి ఏకంగా ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది. దీనికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు వైరల్‌గా మారగా.. ఇది నిజంగానే ఆశ్చర్యం కలిగిస్తోందని నెటిజన్లు పేర్కొన్నారు.

ఈ ఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. ఇక్కడ నివాసముంటున్న మహమ్మద్ వహీద్ భార్య జీనత్ వహీద్ అనే 27 ఏళ్ల మహిళ గంట వ్యవధిలో ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది. పాకిస్థాన్‌లోని రావల్పిండిలోని జిల్లా ఆసుపత్రిలో జీనత్ గత శుక్రవారం (ఏప్రిల్ 19) నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలకు జన్మనిచ్చింది. శిశువులను ఇంక్యుబేటర్లలో ఉంచారని, తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని పాకిస్థాన్‌కు చెందిన డాన్ వార్తా సంస్థ వెల్లడించింది.

జీనత్‌కి ఇది మొదటి డెలివరీ కాగా ఏప్రిల్ 18న ఆమెకు ప్రసవ నొప్పులు వచ్చాయి. కుటుంబసభ్యులు ఆమెను రావల్పిండిలోని జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. ఆ తర్వాత  అదే రోజున గంట వ్యవధిలో జీనత్ ఒకరి తర్వాత ఒకరుగా ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఆరుగురు శిశువులు రెండు పౌండ్ల కంటే తక్కువ బరువుతో ఉన్నారని, పిల్లలందరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఇటువంటి కేసులు చాలా అరుదుగా జరుగుతాయి. వైద్యుల ప్రకారం, ప్రతి 4.5 బిలియన్ల మహిళల్లో ఒకరు ఏకకాలంలో ఆరు పిల్లలకు జన్మనిస్తున్నారు. ఇటువంటి గర్భాలు సమస్యలను, అధిక ప్రమాదాలను కలిగి ఉంటాయి. 1974లో దక్షిణాఫ్రికాలో మొదటి సరిగా  ఆరుగురు పిల్లలు పుట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..