AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫోన్‌లో మునిగిపోయింది..తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో తేలింది..! షాకింగ్‌ వీడియో వైరల్

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. అయితే అదే స్మార్ట్‌ఫోన్ పట్ల అప్రమత్తంగా ఉండకపోతే ప్రాణాలకే ప్రమాదంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉంటారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఒక మైండ్ బ్లోయింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొబైల్ ఫోన్ చూస్తూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఒక మహిళ, ప్రమాదవశాత్తు తెరిచి ఉన్న ఒక పెద్ద మ్యాన్‌హోల్‌లో పడిపోయింది.

ఫోన్‌లో మునిగిపోయింది..తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో తేలింది..! షాకింగ్‌ వీడియో వైరల్
Woman Falls Into Manhole
Jyothi Gadda
|

Updated on: Jun 05, 2026 | 10:30 AM

Share

ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు వినోదాన్ని పంచుతాయి, కొన్ని ఆశ్చర్యపరుస్తాయి, మరికొన్ని చూసిన తర్వాత కొన్ని క్షణాల పాటు మనం నిశ్చేష్టులమైపోతాం. ప్రస్తుతం అలాంటి ఒక షాకింగ్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక యువతికి జరిగిన ఘటనను చూసి చాలా మంది షాక్‌కు గురయ్యారు. స్మార్ట్‌ఫోన్ చూస్తూ నడవడం ఎంత ప్రమాదకరమో హెచ్చరించే షాకింగ్ వీడియో ఇది. అసలేం జరిగిందంటే?

వైరల్ అవుతున్న సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం.. ఒక మహిళ చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని, దాని స్క్రీన్‌ వైపే చూస్తూ రోడ్డు పక్కన నడుచుకుంటూ వస్తోంది. ఆమె దృష్టి పూర్తిగా ఫోన్ పైనే ఉండటంతో చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనించే స్థితిలో లేదు. సరిగ్గా అదే సమయంలో రోడ్డుపై ఒక చోట డ్రైనేజీ మ్యాన్‌హోల్ మూత తీసి ఉంది. దురదృష్టవశాత్తు ఆ మహిళ ఆ గుంతను గమనించకుండా నేరుగా వెళ్లి అందులో పడిపోయింది. ఆమె ఒక్కసారిగా మ్యాన్‌హోల్‌లోకి అదృశ్యమవ్వడం చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడవడం ఖాయం.

ఇవి కూడా చదవండి

ఈ ప్రమాదాన్ని గమనించిన పక్కనే ఉన్న కొందరు వ్యక్తులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరుగున అక్కడికి చేరుకున్నారు. క్షణాల్లోనే ఒక వ్యక్తి ఆ మ్యాన్‌హోల్‌లోకి దిగి, లోపల చిక్కుకున్న మహిళను పైకి తీసుకురావడానికి ప్రయత్నించాడు. మిగిలిన వారు పైనుంచి అతనికి సహాయం చేసి, ఆ మహిళను సురక్షితంగా బయటకు తీశారు. అదృష్టవశాత్తూ స్థానికులు సకాలంలో స్పందించడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. అయితే ఆమెకు ఎలాంటి గాయాలయ్యాయనే విషయంపై స్పష్టత లేదు.

ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. రోడ్డుపై నడిచేటప్పుడు ఫోన్లు చూడటం ఎంత ప్రమాదకరమో చెప్పడానికి ఇదే నిదర్శనం అని కొందరు కామెంట్ చేస్తుండగా..అసలు రోడ్డుపై మ్యాన్‌హోల్ మూత తీసి వదిలేయడం అధికారుల నిర్లక్ష్యమే అని మరికొందరు మండిపడుతున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఏది ఏమైనప్పటికీ, ఈ ప్రమాదం మనందరికీ ఒక పెద్ద పాఠం. రోడ్లపై నడుస్తున్నప్పుడు, ముఖ్యంగా ట్రాఫిక్ లేదా నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో మొబైల్ ఫోన్లను ఉపయోగించడం పూర్తిగా విస్మరించాలి. మన ప్రాణాల రక్షణ మన చేతుల్లోనే ఉందనే విషయాన్ని గ్రహించి, నడిచేటప్పుడు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఫోన్‌లో మునిగిపోయింది..తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో తేలింది!వీడియో
ఫోన్‌లో మునిగిపోయింది..తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో తేలింది!వీడియో
శివుడి మెడలో నాగుపాము ఎందుకు ఉంటుంది? దాని వెనుక ఉన్న రహస్యం..
శివుడి మెడలో నాగుపాము ఎందుకు ఉంటుంది? దాని వెనుక ఉన్న రహస్యం..
అర్ధరాత్రి లిఫ్ట్ అడిగిన యువతి.. కట్ చేస్తే.. ట్విస్ట్ అదుర్స్
అర్ధరాత్రి లిఫ్ట్ అడిగిన యువతి.. కట్ చేస్తే.. ట్విస్ట్ అదుర్స్
సొంతిట్లో ఇలాంటి వారు ఉంటే డేంజర్.. సంతోషం దూరమవుతుంది!
సొంతిట్లో ఇలాంటి వారు ఉంటే డేంజర్.. సంతోషం దూరమవుతుంది!
కర్ణాటక కాంగ్రెస్‌లో ముసలం..మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా
కర్ణాటక కాంగ్రెస్‌లో ముసలం..మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా
సీబీఎస్ఈ రీవాల్యుయేషన్‌కు వెల్లువలా దరఖాస్తులు! బిగ్ సైబర్ దాడి..
సీబీఎస్ఈ రీవాల్యుయేషన్‌కు వెల్లువలా దరఖాస్తులు! బిగ్ సైబర్ దాడి..
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ‘బాంబ్రోలిస్తాన్’.. అసలు స్టోరీ ఇదే..!
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ‘బాంబ్రోలిస్తాన్’.. అసలు స్టోరీ ఇదే..!
హైదరాబాద్‌లో ఎబోలా కలకలం.. రెండు అనుమానిత కేసులు!
హైదరాబాద్‌లో ఎబోలా కలకలం.. రెండు అనుమానిత కేసులు!
పైల్స్ తో బాధపడేవారికి ఇది దివ్య ఔషధం..
పైల్స్ తో బాధపడేవారికి ఇది దివ్య ఔషధం..
60 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. 14 ఏళ్ల చిన్న అమ్మాయితో స్టార్ హీరో
60 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. 14 ఏళ్ల చిన్న అమ్మాయితో స్టార్ హీరో