AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖాన్ సర్ ఇంటిని ముట్టడించిన వేలాది మంది విద్యార్థులు.. చేతులు జోడించి వెనక్కి పంపిన గురువు! అసలేం జరిగిందంటే?

ఖాన్ సార్ తీర్చిదిద్దిన విద్యార్థులు కష్టకాలంలో తమ గురువుకు మద్దతు కొనసాగిస్తారా? అంటే.. ఈ ప్రశ్నకు సమాధానం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఒక వీడియోలో వెల్లడైంది. ఆయన కోచింగ్ సెంటర్‌లో జరిగిన ఒక సంఘటన తర్వాత వేలాది మంది విద్యార్థులు ఆయన ఇంటి బయట గుమిగూడటం ఆ వీడియోలో కనిపిస్తుంది. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన తర్వాత, ఈ ప్రేమ ఒక్క వ్యక్తిది కాదు, ఖాన్ సర్ సంవత్సరాల తరబడి చేసిన కృషి ఫలితం అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కుమ్మరిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే...

ఖాన్ సర్ ఇంటిని ముట్టడించిన వేలాది మంది విద్యార్థులు.. చేతులు జోడించి వెనక్కి పంపిన గురువు! అసలేం జరిగిందంటే?
Khan Sir Patna
Jyothi Gadda
|

Updated on: Jun 05, 2026 | 8:38 AM

Share

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన అధ్యాపకులలో ఒకరైన ఖాన్ సర్ (పాట్నా) పట్ల విద్యార్థులకు ఉన్న అభిమానం మరోసారి నిరూపితమైంది. ఇటీవల ఆయన కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ వెలుపల జరిగిన ఒక హింసాత్మక ఘటన తర్వాత, వేలాది మంది విద్యార్థులు ఆయనకు సంఘీభావం తెలపడానికి, ఆయన భద్రతపై ఆందోళనతో పాట్నాలోని ఆయన నివాసం వెలుపల భారీగా గుమిగూడారు. ఈ క్రమంలో రోడ్డుపై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోవడంతో పరిస్థితిని అదుపు చేయడానికి ఖాన్ సర్ స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది.

అందిన సమాచారం ప్రకారం, జూన్ 2వ తేదీన పాట్నాలోని ముసల్లాపూర్ హాట్ పరిధిలో ఉన్న ఖాన్ సర్ కోచింగ్ సెంటర్‌పై కొందరు దుండగులు దాడి చేసి, కాల్పులు జరిపారు. ఈ గొడవలో ఇన్‌స్టిట్యూట్ సెక్యూరిటీ గార్డు తీవ్రంగా గాయపడ్డారు. వ్యాపార పోటీ తట్టుకోలేక కొందరు ప్రత్యర్థి కోచింగ్ సెంటర్ల నిర్వాహకులే ఈ దాడి వెనుక ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ వార్త తెలియగానే ఖాన్ సర్ విద్యార్థులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. తమ ప్రియతమ గురువుకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది విద్యార్థులు ఆయన ఇంటి ముందు చేరి నిరసన ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

భారీగా చేరుకున్న విద్యార్థుల నిరసనతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ఉండటానికి ఖాన్ సర్ తన ఇంటి బాల్కనీలోకి వచ్చారు. రోడ్డుపై కూర్చున్న విద్యార్థులను చూసి ఆయన ఎమోషనల్ అయ్యారు. విద్యార్థులందరికీ రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ, దయచేసి మీరంతా శాంతిని పాటించండి, రోడ్డు ఖాళీ చేసి మీ ఇళ్లకు తిరిగి వెళ్లండి అని పదే పదే విజ్ఞప్తి చేశారు. పోలీస్ ఉన్నతాధికారులు రాత్రంతా అక్కడే ఉండి విచారణ జరిపారని, ప్రభుత్వం, పోలీసులు ఈ కేసుపై కఠిన చర్యలు తీసుకుంటున్నారని ఆయన విద్యార్థులకు నచ్చజెప్పారు. ప్రస్తుతం ముందస్తు జాగ్రత్తగా కోచింగ్ సెంటర్‌ను తాత్కాలికంగా మూసివేసి, అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సాషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తమ గురువు కోసం వేలాది మంది పిల్లలు రోడ్డుపైకి రావడం చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఉపాధ్యాయుడికి ఇంతకంటే పెద్ద సంపాదన ఏముంటుంది? కోట్లాది రూపాయల ఆస్తి కంటే విద్యార్థులు చూపించే ఈ ప్రేమే ఖాన్ సర్ సంపాదించిన అసలైన సంపద అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పేద విద్యార్థులకు తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అందిస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఖాన్ సర్ పట్ల విద్యార్థులకు ఉన్న గౌరవానికి ఈ ఘటనే నిదర్శనం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us