AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: భర్తలను మార్చుకున్న ఇద్దరు యువతులు.. 4 ఏళ్లు నో ప్రాబ్లం.. సీన్ కట్ చేస్తే.!

ఇద్దరు యువతులు పరస్పర అంగీకారంతో తమ భర్తలను మార్చుకున్నారు. నాలుగేళ్ల పాటు ఈ బంధం కొనసాగింది. అంతా సజావుగా సాగింది కూడా. సీన్ కట్ చేస్తే.. ఓ యువతి తన భర్త వివాహేతర బంధంలో ఉన్న మహిళను పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలంటూ లఖ్‌నవూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది.

Viral: భర్తలను మార్చుకున్న ఇద్దరు యువతులు.. 4 ఏళ్లు నో ప్రాబ్లం.. సీన్ కట్ చేస్తే.!
Husband Swapping
Ravi Kiran
|

Updated on: Jan 29, 2024 | 5:30 PM

Share

ఇద్దరు యువతులు పరస్పర అంగీకారంతో తమ భర్తలను మార్చుకున్నారు. నాలుగేళ్ల పాటు ఈ బంధం కొనసాగింది. అంతా సజావుగా సాగింది కూడా. సీన్ కట్ చేస్తే.. ఓ యువతి తన భర్త వివాహేతర బంధంలో ఉన్న మహిళను పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలంటూ లఖ్‌నవూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది.

ఇంతకీ అసలేం జరిగిందంటే..

బహ్రైచ్‌కు చెందిన ఓ యువతికి.. 2019లో ఓ యువకుడితో వివాహమైంది. వారిద్దరూ ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇక నాలుగేళ్ల క్రితం సదరు యువతి.. తన భర్తతో కలిసి స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో స్నేహితురాలి భర్త కూడా అక్కడే ఉన్నాడు. నలుగురు కలిసి సరదాగా గడిపారు. క్రమంగా వీరి మధ్య చనువు మరింత పెరిగింది. అదే సంవత్సరం డిసెంబర్ ఈ రెండు జంటలు కలిసి క్రిస్మస్ పార్టీ జరుపుకున్నారు. ఈ కోవలోనే స్నేహితురాలిద్దరూ తమ భర్తలను మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. పరస్పర అంగీకారంతో ఈ బంధం నాలుగేళ్ల పాటు సజావుగా సాగింది.

కానీ చిక్కు ఎక్కడొచ్చిందంటే.. బహ్రైచ్ యువతి భర్త తన భార్య స్నేహితురాలితో ప్రేమలో పడ్డాడు. ఇది కాస్తా అతడి భార్యకు తెలిసింది. ఈ విషయంపై భర్తను, స్నేహితురాలిని నిలదీసింది. దీంతో రెండు జంటల మధ్య గొడవలు పెరిగాయి. విడాకులు తీసుకోకుండా తన భర్త.. మరో మహిళను వివాహం చేసుకున్నాడని బహ్రైచ్ యువతి ఆరోపించింది. పలుసార్లు భర్తతో గొడవపడింది. అంతేకాకుండా అతడిపై కేసు పెట్టింది. దీంతో బహ్రైచ్ యువతి భర్త లఖ్‌నవూ ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశాడు. ఆ తర్వాత దంపతులిద్దరికీ కౌన్సిలింగ్ ఇప్పించింది ఫ్యామిలీ కోర్టు. అయితే ఆమె భర్త ఏమో.. భార్యను బెదిరించడానికే మరో మహిళను పెళ్లి చేసుకున్నట్టు చెప్పానని.. నిజానికి తాను ఎవ్వరిని పెళ్లి చేసుకోలేదని చెప్పాడు. ప్రస్తుతం వీరిద్దరి కేసు విచారణ కోర్టులో సాగుతోంది.

కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..