Anant Ambani: అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ కోసం జామ్‌నగర్‌ను ఎందుకు ఎంచుకున్నారో తెలుసా..? కారణం ఇదేనట..!

| Edited By: Anil kumar poka

Mar 02, 2024 | 9:42 AM

ఈ నేపథ్యంలో జామ్‌నగర్‌లో అంబానీ కుటుంబం భారీ ఏర్పాట్లు చేసింది. ఇక ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు దాదాపు ప్రపంచవ్యాప్తంగా 1000 మంది ప్రముఖులకు ఆహ్వానం పంపించారు. వీరందరికీ 2500 రకాల పసందైన వంటకాలతో విందు భోజనాన్ని రుచి చూపించనున్నారు అంబానీ కపుల్. ఇక ప్రీ వెడ్డింగ్ సాంప్రదాయబద్ధంగా, అట్టహాసంగా నిర్వహించడానికి కావలసిన ఏర్పాట్లు భారీగానే జరిగాయి.

Anant Ambani: అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ కోసం జామ్‌నగర్‌ను ఎందుకు ఎంచుకున్నారో తెలుసా..? కారణం ఇదేనట..!
Anant Ambani And Radhika Me
Follow us on

దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ త్వరలో వివాహం చేసుకోబోతున్నారు. అనంత్ తన చిన్ననాటి స్నేహితురాలు రాధిక మర్చంట్‌ను వివాహం చేసుకోనున్నారు. వీరిద్దరికీ గతేడాది నిశ్చితార్థం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. కాగా, గుజరాత్‌లోని ముఖేష్ అంబానీ స్వస్థలం జామ్‌నగర్‌లో అనంత్, రాధికల ప్రీ వెడ్డింగ్ ప్రారంభమయ్యాయి. కొద్ది రోజుల క్రితం ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ బయటకు వచ్చింది. ఈ కార్యక్రమం మార్చి 1, 2024 నుండి మార్చి 3, 2024 వరకు దాదాపు మూడు రోజుల పాటు కొనసాగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కోసం సల్మాన్ ఖాన్, జాన్వీ కపూర్ వంటి పలువురు బాలీవుడ్ నటీనటులు జామ్‌నగర్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో జామ్‌నగర్‌లో అంబానీ కుటుంబం భారీ ఏర్పాట్లు చేసింది.

ఫిబ్రవరి 28న జామ్‌నగర్‌లో అంబానీ కుటుంబం అన్న సేవా కార్యక్రమం జరిగింది. అయితే అనంత్, రాధిక ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌ను జామ్‌నగర్‌లో ఎందుకు నిర్వహించారని చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇదిలా ఉంటే, జామ్‌నగర్‌లో ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌ను నిర్వహించడం వెనుక గల కారణాలను అనంత్ అంబానీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

ఇంటర్వ్యూలో అనంత్ మాట్లాడుతూ, జామ్‌నగర్‌తో తమ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. అనంత తల్లి ఇక్కడే పుట్టింది. తమ తాత కూడా ఇక్కడి నుంచే వ్యాపారం ప్రారంభించారని చెప్పారు. నాన్న జామ్‌నగర్‌లోనే తాతయ్య దగ్గర పనిచేశారని, తాను కూడా జామ్‌నగర్‌లో పెరిగానని చెప్పాడు.. అందుకే ఈ కార్యక్రమాన్ని జామ్‌నగర్‌లో నిర్వహించినట్టుగా వివరించారు.

ఈ నేపథ్యంలో జామ్‌నగర్‌లో అంబానీ కుటుంబం భారీ ఏర్పాట్లు చేసింది. ఇక ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు దాదాపు ప్రపంచవ్యాప్తంగా 1000 మంది ప్రముఖులకు ఆహ్వానం పంపించారు. వీరందరికీ 2500 రకాల పసందైన వంటకాలతో విందు భోజనాన్ని రుచి చూపించనున్నారు అంబానీ కపుల్. ఇక ప్రీ వెడ్డింగ్ సాంప్రదాయబద్ధంగా, అట్టహాసంగా నిర్వహించడానికి కావలసిన ఏర్పాట్లు భారీగానే జరిగాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..