కుక్కల దాడులను ఎదుర్కోవడం ఎలా..? వెంబడిస్తే ఏం చేయాలి..? ఎవరిని ఎక్కువగా టార్గెట్ చేస్తాయి..?

వీధి కుక్కల బెడద రోజు రోజు కు పెరుగుతోంది. వాటి దాడులతో జనం భయపడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, ఒంటరిగా నడిచే వాళ్లు వాటి టార్గెట్ అవుతున్నారు. అయితే కొన్ని చిన్న పాటి జాగ్రత్తలు తీసుకుంటే.. వాటి దాడి నుంచి సురక్షితంగా బయటపడవచ్చు.

కుక్కల దాడులను ఎదుర్కోవడం ఎలా..? వెంబడిస్తే ఏం చేయాలి..? ఎవరిని ఎక్కువగా టార్గెట్ చేస్తాయి..?
Dog Bite

Updated on: Aug 18, 2025 | 7:20 PM

వీధి కుక్కల సమస్య రోజురోజుకు పెరుగుతోంది. వాటి దాడుల వల్ల సమాజంలో ఆందోళన కూడా ఎక్కువవుతోంది. ఈ సమస్యకు సరైన పరిష్కారం దొరకనందున, ప్రజల్లో భయం ఇంకా కొనసాగుతోంది. అసలు కుక్కలు ఎందుకు దాడి చేస్తాయి..? ఎవరిని ఎక్కువగా టార్గెట్ చేస్తాయి..? వెంబడిస్తే ఏం చేయాలి..? ఈ విషయాలపై పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కుక్కలు ఎందుకు దాడి చేస్తాయి..?

నిపుణులు చెబుతున్నదాని ప్రకారం.. కుక్కలు వేట స్వభావంతో పుట్టాయి. పట్టణాల్లో వాటికి సరైన ఆహారం దొరకదు. అలాగే వాటికి సరిపడినంత స్వేచ్ఛ కూడా ఉండదు. దీని వల్ల అవి కొన్నిసార్లు ఆవేశంగా మారుతాయి. వీధి కుక్కలకు స్వేచ్ఛ ఉన్నా.. సరైన ఆహారం లేకపోవడం వల్ల ఆకలితో ఇంకా కోపంగా ప్రవర్తిస్తాయి.

ఎవరిని ఎక్కువగా టార్గెట్ చేస్తాయి..?

వీధి కుక్కలు ఎక్కువగా చిన్నపిల్లలను లక్ష్యంగా చేసుకుంటాయి. పెద్దవాళ్లు అరిచి, తమను తాము కాపాడుకోగలరు. కానీ పిల్లలు ఎదిరించలేకపోవడం వల్ల కుక్కలు వారిని సులభమైన లక్ష్యంగా భావిస్తాయి. ముఖ్యంగా ఆకలిగా ఉన్నప్పుడు లేదా ఏదైనా విపత్తు సమయంలో ఆహారం దొరకనప్పుడు.. కుక్కలు మరింత ప్రమాదకరంగా మారతాయి.

గుంపుగా తిరిగే కుక్కలు

సాధారణంగా వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతాయి. ఒంటరిగా ఉన్నప్పుడు కంటే గుంపులో ఉన్నప్పుడు అవి ఇంకా ప్రమాదకరంగా ప్రవర్తిస్తాయి. అయితే అన్ని కుక్కలూ ఒకేలా ఉండవు. ఆహారం దొరికే చోటునే అవి తమ స్థలంగా చేసుకుంటాయి. అక్కడ ఆహారం అయిపోతే మరో చోటుకి వెళ్ళిపోతాయి.

వెంబడిస్తే ఏం చేయాలి..?

  • కుక్కలకు చిన్నప్పుడు రాళ్లు విసిరితే లేదా వాహనం గుద్దుకుని దెబ్బ తగిలితే.. మనుషులపై, వాహనాలపై ద్వేషం పెంచుకుంటాయి.
  • బైక్‌పై ఉంటే.. కొంచెం వేగంగా వెళ్లడానికి ప్రయత్నించండి.
  • నడుస్తుంటే.. చేతిలో ఒక కర్ర లేదా వస్తువు ఉంచుకోండి. కుక్కలు మిమ్మల్ని కరిచేందుకు కాకుండా.. భయపెట్టేందుకు మాత్రమే వస్తాయి. మీరు గట్టిగా అరిచినా, ధైర్యంగా నిలబడినా అవి వెనక్కి తగ్గుతాయి.
  • పరిగెత్తవద్దు.. కుక్క వెంబడిస్తే భయంతో పరిగెత్తకండి. మీరు పరిగెత్తితే.. అది మిమ్మల్ని సవాలుగా భావించి ఇంకా వేగంగా వెంటాడుతుంది.
  • నిలబడి ఉండండి.. కదలకుండా నిలబడితే అవి కంగారుపడి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవచ్చు.
  • కళ్ళలోకి చూడవద్దు.. కుక్క కళ్ళలోకి నేరుగా చూడకండి. అది మీరు దాడికి సిద్ధమవుతున్నారని భావించే అవకాశం ఉంది.
  • వస్తువు విసిరేయండి.. మీ చేతిలో వాటర్ బాటిల్ లేదా ఏదైనా వస్తువు ఉంటే.. కుక్కకు వ్యతిరేక దిశలో విసిరేయండి. దాని దృష్టి మారిపోతుంది.
  • ముఖాన్ని కాపాడుకోండి.. చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో చేతులను ముఖానికి దగ్గరగా పెట్టుకోండి. అది ముఖాన్ని కాపాడటానికి సహాయపడుతుంది. ఈ చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే వీధి కుక్కల దాడి నుండి తప్పించుకోవచ్చు.

(NOTE: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వీధి కుక్కల నుండి తమను తాము ఎలా రక్షించుకోవాలో ప్రజలకు తెలియజేయడమే ఈ సమాచారం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఏదైనా కుక్క దాడి చేసినా లేదా తీవ్రమైన గాయాలు అయినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వీలైనంత త్వరగా వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం)