భారత్‌లో ఉన్న ఏకైక మగ నది.. దీన్ని మిస్టరీ తెలిస్తే నోరెళ్లబెడతారు..

గంగ, యమున, గోదావరి, కావేరి.. మన దేశంలో నది అంటే ఒక అమ్మ, ఒక దేవత. ప్రవహించే ప్రతి నదిని స్త్రీమూర్తిగా కొలిచే మన దేశంలో.. ఒకే ఒక్క నదిని మాత్రంగా పురుషుడి కొలుస్తారు. అదే హిమాలయాల నుంచి ఉగ్రరూపంతో ఉరికే బ్రహ్మపుత్ర. అసలు నదులన్నీ స్త్రీలైన దేశంలో బ్రహ్మపుత్ర మాత్రమే పురుషుడిగా ఎందుకు మారాడు? ఆ పేరు వెనుక ఉన్న ఆసక్తికర రహస్యం ఏంటో తెలుసుకుందాం

భారత్‌లో ఉన్న ఏకైక మగ నది.. దీన్ని మిస్టరీ తెలిస్తే నోరెళ్లబెడతారు..
Why Is Brahmaputra Called A Male River

Updated on: Aug 15, 2026 | 8:30 AM

భారతదేశ సంస్కృతి, పురాణాలు, చరిత్రతో జీవనదుల అనుబంధం విడదీయరానిది. గంగ, యమున, గోదావరి, కావేరి, కృష్ణ.. ఇలా దేశంలోని ప్రధాన నదులన్నింటినీ స్త్రీమూర్తులుగా, దేవతలుగా భావించి పూజించడం మన ఆనవాయితీ. అయితే ఈ సంప్రదాయానికి భిన్నంగా నిలిచే ఒకే ఒక్క మహా నది బ్రహ్మపుత్ర. మన దేశంలో పురుష నదిగా గుర్తింపు పొందిన ఏకైక ప్రవాహం ఇది. సంస్కృతంలో బ్రహ్మపుత్ర అంటే బ్రహ్మదేవుని కుమారుడు అని అర్థం. హిందూ పురాణాల ప్రకారం.. ఈ నది సృష్టికర్త అయిన బ్రహ్మ దేవుని అంశతో ఉద్భవించిందని నమ్ముతారు.

రౌద్ర రూపం – పురుష లక్షణాలు

స్త్రీ రూప నదులు శాంతం, మాతృత్వానికి ప్రతీకలైతే.. బ్రహ్మపుత్ర గంభీరత, అనూహ్యమైన ఉధృతికి ప్రసిద్ధి. ఉగ్రరూపంతో విరుచుకుపడే భారీ వరదలు, భీకర ప్రవాహం కారణంగా స్థానిక సంస్కృతిలో దీనికి పురుష లక్షణాలను ఆపాదించారు.

ఒకే నది.. వేర్వేరు దేశాలు.. ఎన్నో పేర్లు

దాదాపు 2,900 కిలోమీటర్ల పొడవున ప్రవహించే బ్రహ్మపుత్ర ఆసియాలోనే అతిపెద్ద నదులలో ఒకటి. ఇది ప్రవహించే ప్రాంతాన్ని బట్టి వివిధ పేర్లతో పిలుస్తుంటారు.

టిబెట్: హిమాలయాల్లోని గ్లేసియర్ల వద్ద జన్మించే ఈ నదిని టిబెట్‌లో యార్లుంగ్ త్సాంగ్పో అంటారు.

భారత్ (అరుణాచల్ ప్రదేశ్): భారత్‌లోకి ప్రవేశించగానే దీనిని సియాంగ్ లేదా దిహాంగ్ అని పిలుస్తారు.

భారత్ (అస్సాం): అస్సాం లోయలోకి చేరాక దీనికి అధికారికంగా బ్రహ్మపుత్ర అనే పేరు స్థిరపడింది.

బంగ్లాదేశ్: సరిహద్దు దాటి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించాక యమునగా మారి, పద్మ నదితో కలిసి బంగాళాఖాతంలో కలుస్తుంది.

అస్సాం జీవనాడి.. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం

బ్రహ్మపుత్రను అస్సాం జీవనాడిగా చెప్తారు. లక్షలాది మంది ప్రజల తాగునీరు, సాగునీటి అవసరాలు, చేపల వేట, పర్యావరణ వ్యవస్థకు ఈ నదే ఆధారం. ప్రపంచంలోనే మానవ నివాసాలు ఉన్న అతిపెద్ద నదీ ద్వీపం మజులి బ్రహ్మపుత్ర ప్రవాహం మధ్యలోనే ఉంది. అంతరించిపోతున్న ఒంటికొమ్ము ఖడ్గమృగాలు ఉండే ప్రసిద్ధ ఖాజీరంగా నేషనల్ పార్క్ సహా అనేక రకాల అరుదైన పక్షులు, వన్యప్రాణులకు ఈ నదీ పరీవాహక ప్రాంతం ఆశ్రయం ఇస్తుంది.

బ్రహ్మపుత్రను వీక్షించడానికి బెస్ట్ టూరిజం స్పాట్స్

బ్రహ్మపుత్ర నది గంభీరతను, ప్రకృతి రమణీయతను అనుభవించాలనుకునే పర్యాటకులకు ఈ ప్రాంతాలు మంచి ఎంపిక.

గౌహతి: నదిలో ఈవినింగ్ బోట్ క్రూయిజ్ రైడ్స్ చేస్తూ అద్భుతమైన సూర్యాస్తమయ దృశ్యాలను వీక్షించవచ్చు.

మజులి ద్వీపం: జోర్హాట్ నుండి ఫెర్రీ ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. అస్సామీ వైష్ణవ సంస్కృతిని ప్రతిబింబించే సత్రాలు, సాంప్రదాయ ముఖాముఖి కళారూపాలకు ఇది పెట్టింది పేరు.

దిబ్రూగఢ్ : టీ సిటీ ఆఫ్ ఇండియాగా పిలిచే ఈ ప్రాంతంలో ఒకవైపు బ్రహ్మపుత్ర అందాలు, మరోవైపు పచ్చని తేయాకు తోటలు పర్యాటకులను కట్టిపడేస్తాయి.

అరుణాచల్ ప్రదేశ్: నది ప్రాథమిక ఉధృతిని, లోతైన లోయలను, హిమాలయ పర్వత సౌందర్యాన్ని చూడాలంటే సియాంగ్ ప్రాంతాన్ని సందర్శించాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us