Viral Video: ప్రతీ మనిషి జీవితంలో వివాహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. వందేళ్ల జీవితంలో వివాహాన్ని ఓ కీలక ఘట్టంగా భావిస్తుంటారు. అందుకే అటు అమ్మాయి కానీ ఇటు అబ్బాయి కానీ తమకు నచ్చిన వ్యక్తినే వివాహం చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే పెద్దల కోరిక మేరకో, తప్పని పరిస్థితుల్లోనో కొందరు ఇష్టం లేని వివాహాన్ని చేసుకోవాల్సి వస్తుంది. మనసులో ఇష్టం లేకపోయినా బయటకు నటిస్తూ వివాహం చేసుకుంటే ఆ బాధను మాటల్లో వర్ణించలేము. మనసులో ఉన్న బాధ ముఖంపై కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఓ నవ వధువుకు సంబంధించిన వీడియో చూస్తుంటే ఇదే భావన కలుగుతోంది.
అప్పుడే వివాహామైన కొత్త జంటను దండలను మార్చుకోవాలని కుటుంబసభ్యులు తెలిపారు. అయితే సదరు నవ వధువుకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారా.? లేదా అంతకు ముందు ఏదైనా గొడవ జరిగిందో తెలియదు కానీ.. పూల దండను అయిష్టంతో దులిపింది. దీంతో దండలోని పూలన్నీ నేలపై రాలిపోయాయి. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కానీ పెళ్లి కొడుకు అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఇక దీనంతటినీ అక్కడే ఉన్న కుటుంబసభ్యులు వీడియో తీశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు ‘పెళ్లికి ముందే ఇలా ఉంటే వివాహమైన తర్వాత పరిస్థితి ఏంటో’అని కామెంట్లు పెడుతున్నారు.
Also Read: Two Headed Snake: అదృష్టాన్ని తెచ్చే రెండు తలల పామంటూ అమ్మకానికి యత్నం.. పోలీసుల ఎంట్రీతో..
Mumaith Khan: డ్రగ్స్ కేసులో ముగిసిన ముబైత్ ఖాన్ ఈడీ విచారణ.. 7 గంటల విచారణలో ఏం తేలిందంటే..