ప్రపంచం ఎంత అభివృద్ధి సాధించినా, నేటికీ కడుపు నింపుకోవడానికి పండిన గింజలను ఉత్పత్తి చేయడానికి చాలా కష్టపడాలి. శాస్త్రీయ యుగంలో వ్యవసాయానికి అతిపెద్ద యంత్రాలు వినియోగిస్తున్నా కానీ, నేటికీ కొన్ని చోట్ల పేద రైతులు సంప్రదాయ వ్యవసాయం చేస్తూ చాలా కష్టపడి పని చేస్తున్నారు. ప్రస్తుతం, నేలను సారవంతం చేయడం నుండి, విత్తనాలు విత్తడం, పంటలు పండించడం వరకు అదో యజ్ఞంలాంటిది. అయితే, కొందరు రైతులు తమలోని సృజనాత్మకతను వ్యవసాయ పనుల్లో బయటపెడుతుంటారు. తమ టెక్నీక్ ఉపయోగించి కొత్తవిధానాలను రూపొందిస్తున్నారు. కష్టపడి చేయాల్సిన పనిని చాలా సులువుగా చేస్తుంటారు కొందరు స్మార్ట్ వర్కర్లు.
ఇటీవల, ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. ఇందులో ఒక వ్యక్తి గోధుమ పంట పండిస్తున్నాడు. కోతకు వచ్చిన పంటను కోసేందుకు అతడు ఓ టెక్నిక్ ఉపయోగించాడు. ఏపుగా పెరిగిన గోధుమ గడ్డిని కోసేందుకు అతని చేతిలో ఓ విచిత్ర పరికరం ఉంది. దాంతో అతడు ఒకసారి అడ్డంగా ఊపేస్తున్నాడు..అంతే, గోధుమగ్గి ఆ యంత్రానికి ఉన్న గంపలాంటి లోతైన ప్రదేశంలోకి వచ్చేస్తోంది. ఇక దాన్ని వరుసక్రమంలో పక్కకు పెట్టేస్తున్నాడు. అదేదో, ఈగలు, దోమల్ని తోలినంత ఈజీగా అతడు తన సాధనంతో పంటను కోస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ప్రశంసల కామెంట్లు కుమ్మరిస్తున్నారు.
Between tradition and modernity.
Harvest wheat.??? pic.twitter.com/gbv0oaFLyf— Tansu YEĞEN (@TansuYegen) June 15, 2022
సోషల్ మీడియా వినియోగదారులు అతడి నైపుణ్యానికి ఆశ్చర్యపోతున్నారు. ట్విట్టర్ ఖాతాతో వీడియో షేర్ చేయబడింది. వార్తలు రాసే సమయానికి 1 మిలియన్ కంటే ఎక్కువ వీక్షణలు వచ్చాయి. అదే సమయంలో, చాలా మంది వినియోగదారులు తమ స్పందనను తెలియజేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి