గత కొద్ది రోజులుగా ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఒక్క ఫోటోను తీక్షణంగా చూడడం.. లేదా..సెకన్ల వ్యవధిలో ఓ ఫోటోలో మీరు ఏం చూస్తున్నారు అనేది చాలా ముఖ్యం. ఒక వస్తువును… లేదా ఫోటోలలో మనం చూసే విధానమే మన ఆలోచన విధానాన్ని తెలియజేస్తుంటాయి. మన కంటి చూపుపై మన వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుందనేది కాస్త సందేహం కలిగించే అంశమే. నిజానికి ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోస్ చాలా విచిత్రంగా ఉంటాయి. ఒకరు చూసిన విషయమే మరొకరు చూస్తారనేది కచ్చితం కాదు… ఇద్దరు వేర్వేరు వ్యక్తులు ఒకే చిత్రంలో రెండు వేర్వేరు విషయాలను గుర్తించగలరు.. అదేలాగో ఈ ఫోటో చూసి తెలుసుకుందామా..
పైన ఫోటోను చూశారు కదా… ఆ అప్టికల్ ఇల్యూషన్ చూడగానే ముందుగా మీరు ఏం గమనించారు… అందులో రెండు చిత్రాలున్నాయి.. ఒకటి చెట్టు, మరొకటి జంట..
ముందుగా చెట్టును గమనించినట్లయితే..
ముందుగా మీరు చెట్టును చూసినట్లయితే మీరు చాలా వివరాలపై శ్రద్ద చూపిస్తారు. అంతేకాకుండా.. ఇతరుల మనోభావాలను సులభంగా చదవగలరు…
జంటను చూస్తే..
మీరు ముందుగా జంటను చూసినట్లయితే మీరు తార్కికంగా..హేతుబద్దంగా … ప్రశాంతంగా ఉంటారు.. ఇతరులు ఆందోళనకు గురైనప్పటికీ మీరు.. తార్కికంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి విషయాన్ని క్షుణ్మంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.