AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీకు తెలుసా.. సమోసాను ఇంగ్లీషులో ఏమంటారు..? ఆన్సర్ అస్సలు ఊహించలేరు..

సమోసా అంటే ఇష్టపడని తెలుగువాళ్లు ఎవరైనా ఉంటారా? శతాబ్దాల క్రితం ఇరాన్ నుంచి వ్యాపారుల వెంట నడుచుకుంటూ వచ్చి, ఢిల్లీ దర్బార్లు, హైదరాబాద్ నిజాంల విందుల మీదుగా మన గల్లీ కేఫ్‌లలో శాశ్వత తిష్ట వేసింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దీనిని ఇంగ్లీషులో ఏమంటారో తెలుసా..?

మీకు తెలుసా.. సమోసాను ఇంగ్లీషులో ఏమంటారు..? ఆన్సర్ అస్సలు ఊహించలేరు..
What Is Samosa Called In English
Krishna S
|

Updated on: Sep 02, 2026 | 12:49 PM

Share

సాయంత్రం నాలుగు దాటిందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లోని గల్లీ గల్లీలో ఉన్న ఇరానీ కేఫ్‌లు, హోటళ్లు, రోడ్డు పక్కన బండ్ల దగ్గర సమోసాల ఘుమఘుమలు మొదలైపోతాయి. కడక్ ఇరానీ చాయ్ లేదా వేడివేడి ఫిల్టర్ కాఫీతో పాటు కరకరలాడే ఉల్లిగడ్డ సమోసా లేదా ఆలూ సమోసా నంజుకుని తింటే ఆ మజాయే వేరు. కాలేజీ కుర్రాళ్ల అడ్డా అయినా, ఆఫీస్ ముచ్చట్లయినా సమోసా లేనిదే ఈవెనింగ్ స్నాక్ పూర్తవదు. మరి మన రోజువారీ జీవితంలో ఇంతగా కలిసిపోయిన ఈ సమోసాను ఇంగ్లీషులో ఏమంటారో ఎప్పుడైనా ఆలోచించారా?.. చాలామంది సమోసాకు ఆంగ్లంలో ప్రత్యేకంగా ఏదైనా పేరు ఉంటుందేమో అనుకుంటారు. కానీ దీనికి ప్రత్యేక అనువాదం ఏదీ లేదు. సమోసాకున్న క్రేజ్ చూసి ఏకంగా ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీయే Samosa అనే పదాన్ని తమ నిఘంటువులో చేర్చేసింది. కాబట్టి లండన్ వెళ్లినా, అమెరికా వెళ్లినా మెనూలో సమోసా అనే కనిపిస్తుంది. ఒకవేళ ఇంగ్లీషు వారికి ఇది ఎలాంటి ఫుడ్ అని వివరించాల్సి వస్తే మాత్రం.. ట్రయాంగ్యులర్ సావరీ పేస్ట్రీ అని వర్ణిస్తారు. అంటే త్రికోణాకారంలో ఉండి, లోపల కారం, మసాలా కూరలు నింపిన వేపుడు పిండివంటకం అని అర్థం.

సమోసా మన దేశంలో పుట్టలేదా..?

మనం పక్కా దేశీ స్నాక్‌గా భావించే సమోసా అసలు పుట్టింది భారతదేశంలోనే కాదు. దీని స్వస్థలం ప్రాచీన పర్షియా, మధ్య ఆసియా ప్రాంతం. పదో శతాబ్దానికి చెందిన పర్షియన్ చరిత్ర గ్రంథాల్లో దీని ప్రస్తావన ఉంది. అప్పట్లో దీనిని సంబోసా లేదా సంబుషక్ అని పిలిచేవారు. ప్రయాణాల్లో వ్యాపారులు, పర్యాటకులు వీటిని వెంట తెచ్చుకునేవారు. అలా వ్యాపారుల ద్వారా ఇది మన భారత ఉపఖండంలోకి ప్రవేశించింది. ఆ కాలంలో ఇది శాకాహారం కాదు.. లోపల పూర్తిగా మాంసం నింపి చేసేవారు.

హైదరాబాద్ ఇరానీ కేఫ్‌ల నుంచి పల్లెల దాకా..

ఢిల్లీ సుల్తానులు, మొఘలుల ద్వారా రాచరిక విందుల్లో చేరిన సమోసా.. హైదరాబాద్ నిజాంల కాలంలో దక్కన్ ప్రాంతానికి విస్తరించింది. భారత్‌కు వచ్చాక ఇది పూర్తిగా రూపు మార్చుకుంది. మాంసానికి బదులుగా బంగాళాదుంపలు, పచ్చిబఠానీలతో పక్కా శాకాహార వంటకంగా మారిపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దీనికి ప్రత్యేక స్థానం దక్కింది. చాయ్‌తో జోడీ కట్టే చిన్నచిన్న ఉల్లిగడ్డ సమోసాలు ఇక్కడ ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే కోస్తాంధ్ర, రాయలసీమల్లో వేడివేడి ఆలు సమోసా మీద పచ్చిమిర్చి, ఉల్లిపాయలు నంజుకుని తినడం అలవాటు. ఇరాన్ నుంచి హైదరాబాద్ మీదుగా ప్రపంచాన్ని చుట్టేసిన మన సమోసా చరిత్ర నిజంగా ఆశ్చర్యపరిచేదే కదా.

Follow Us
గణపతి నిమజ్జనం, అనంత చతుర్దశి ఒకే రోజున ఎందుకు? అసలు కారణం ఇదే!
గణపతి నిమజ్జనం, అనంత చతుర్దశి ఒకే రోజున ఎందుకు? అసలు కారణం ఇదే!
డబ్బుకు కొదవ ఉండకూడదా? ఇంట్లో ఈ వస్తువులు ఉంచండి!
డబ్బుకు కొదవ ఉండకూడదా? ఇంట్లో ఈ వస్తువులు ఉంచండి!
బంధువుల ఇంటికి వెళ్తున్నారా? చాణక్యుడు చెప్తోన్న టిప్స్ ఇవే..
బంధువుల ఇంటికి వెళ్తున్నారా? చాణక్యుడు చెప్తోన్న టిప్స్ ఇవే..
ప్రజలకు తెలంగాణ సర్కార్ అదిరే దసరా గిఫ్ట్.. వచ్చే నెలలోనే..
ప్రజలకు తెలంగాణ సర్కార్ అదిరే దసరా గిఫ్ట్.. వచ్చే నెలలోనే..
ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు లాస్ట్ ఛాన్స్.. నిమజ్జనం ఎప్పుడంటే?
ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు లాస్ట్ ఛాన్స్.. నిమజ్జనం ఎప్పుడంటే?
మహిళలు శ్రాద్ధం, పిండ ప్రదానం చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతుంది?
మహిళలు శ్రాద్ధం, పిండ ప్రదానం చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతుంది?
ఈయన ఒక దేశ మాజీ ప్రధాని అంటే నమ్ముతారా? స్టేషన్‌ లో ఇలా..!
ఈయన ఒక దేశ మాజీ ప్రధాని అంటే నమ్ముతారా? స్టేషన్‌ లో ఇలా..!
జపాన్‌తో మ్యాచ్‌లో ఊహించని డ్రామా.. అంపైర్‎ను బెదిరించి గెలిచారా
జపాన్‌తో మ్యాచ్‌లో ఊహించని డ్రామా.. అంపైర్‎ను బెదిరించి గెలిచారా
72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. విజేతలుగా నిలిచింది వీరే..
72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. విజేతలుగా నిలిచింది వీరే..
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. ఉరుములు, మెరుపులు...
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. ఉరుములు, మెరుపులు...