Viral News: ముఖం పంది.. శరీరం చేప.. నెట్టింట జోరుగా వైరల్..
సోషల్ మీడియాలో అనేక జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా నెట్టింట షికారు చేస్తూ కనువిందు చేస్తూ ఉంటాయి. కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని బాధ పెట్టిస్తాయి. అయితే సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా కనిపిస్తాయి. అంతే కాకుండా కొన్ని జంతువులు చాలా వింతగా కనిపిస్తాయి. అలాంటి వాటికి సంబంధించిన న్యూస్..
సోషల్ మీడియాలో అనేక జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా నెట్టింట షికారు చేస్తూ కనువిందు చేస్తూ ఉంటాయి. కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని బాధ పెట్టిస్తాయి. అయితే సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా కనిపిస్తాయి. అంతే కాకుండా కొన్ని జంతువులు చాలా వింతగా కనిపిస్తాయి. అలాంటి వాటికి సంబంధించిన న్యూస్ కూడా క్షణాల్లో వైరల్‌గా మారతాయి. తాజాగా సోషల్ మీడియాలో పంది రూపంలో ఉండే ఓ చేప ఫోటోలు సందడి చేస్తున్నాయి. దీన్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇది నిజమేనా? అని అనుమానం పడుతున్నారు.
ఈ జంతువు చూడటానికి చేపలా కనిపిస్తుంది. కానీ ముఖం ఆకారం మాత్రం పందిలా ఉంది. ఊపిరి పీల్చుకోవడం కూడా వరాహంలాగానే పీల్చుకుంటుంది. దీనికి సంబంధించిన వీడియో @gofishingindonesia అనే ఇన్స్టాగ్రామ్ తన ఖాతా షేర్ చేసింది. ఈ ఇన్ స్టా ఖాతాలో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా ఉంటాయి.
ఈ వీడియోలో చేప రూపాన్ని చూసిన వాళ్లు.. నిజంగానే ఇలాగే ఉందా? అని సందేహ పడుతున్నారు. అయితే కొంత మంది మాత్రం ఇది ఫేక్ అని.. దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేశారని అంటున్నారు. మరికొందరు మాత్రం కాదు ఇది నిజమేనని వాదిస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ వీడియో, ఫోటోలు మాత్రం నెట్టింట వైరల్‌గా మారాయి.