రైలు ప్రమాదాలపై చాలా మంది ప్రజలకు అవగాహన ఉండటం లేదు. రైలు ప్రమాదాలకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయంలో భారతీయ రైల్వే అనేక అవగాహనా ప్రచారాలను నిర్వహిస్తోంది. అలాగే, సురక్షితమైన ప్రయాణం కోసం రైల్వే స్టేషన్లలో క్రమం తప్పకుండా మార్గదర్శకాలు కూడా సూచిస్తున్నారు. అయినప్పటికీ కొందరు ప్రయాణికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణం చేస్తున్నారు. ప్రస్తుతం, అటువంటి ప్రాణాంతక రైలు ప్రయాణానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. ఎందుకంటే.. నడుస్తున్న రైలులోని రెండు కోచ్‌ల జాయింట్‌పై కూర్చుని ప్రయాణించవచ్చని మీరు ఊహించగలరా? అయితే ఒక వైరల్ వీడియోలో ఒక మహిళ ప్రాణాపాయ ప్రయాణం చేస్తూ కనిపించింది. ఇక్కడ దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే.. ఆ మహిళ తన చేతుల్లో పసి బిడ్డను కూడా ఎత్తుకుని కనిపించింది.
రైల్వేశాఖ పలుమార్లు ఆదేశాలు జారీ చేసినా కొందరు ప్రయాణికులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి నిర్లక్ష్యమే పలుమార్లు ప్రమాదాలకు కారణం అవుతుంది. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో రైలులోని రెండు కోచ్‌ల జాయింట్‌లో ఒక మహిళ తన ఒడిలో బిడ్డతో ప్రయాణిస్తున్న దృశ్యం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. రెండు రైలు బోగీల జాయింట్‌పై ఈ మహిళ తన ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని కూర్చుంది. ఒక మహిళ ఒక చేతిలో చిన్నారిని పట్టుకుని మరో చేత్తో రైలు కడ్డీని పట్టుకుంది. ఈ వీడియోలో రైలు అత్యంత వేగంతో కదులుతున్నట్లు కనిపిస్తోంది. ఒక మహిళ కొంచెం అజాగ్రత్తగా ఉంటే, ఆమె పడిపోయే అవకాశం ఉందని ఇది చూపిస్తుంది.
This woman did not have money to buy train ticket.
Shameful☹️☹️#BusAccident #CandyCrush #PasooriNu #Tiger3 #MalaikaArora #Wagner #AskSRK #Glastonbury #mumbairain #WorldDrugDay pic.twitter.com/SMUQZGZffl
— Zahid Hasan (@ZahidHa68) June 26, 2023
ఈ వీడియోను ZahidHA68 అనే ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ బడింది. క్యాప్షన్‌లో టికెట్ కొనడానికి మహిళ వద్ద డబ్బు లేదని రాసి ఉంది. అయితే, వీడియో చూసిన చాలా మంది స్పందించారు. కానీ, ఈ వీడియో భారత్‌ది కాదని, బంగ్లాదేశ్‌కు చెందినదని కొందరు వాదిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..