టెక్సాస్, జూన్ 28: ఒక్కోసారి మనం చేసే చిన్నచిన్న పొరబాట్ల వల్ల ఎదుటి వారు తీవ్రంగా హర్ట్ అవుతారు. చిన్న పొరబాటే కదా అని మనం సమర్ధించుకున్నా.. ఎదుటి వారి దృష్టిలో అది మరచిపోలేని చెడు జ్ఞాపకంగా మనసులో ముద్రపడిపోతుంది. అలాంటి సంఘటనే తాజాగా ఎయిర్‌లైన్స్‌లో చోటుచేసుకుంది. లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అయ్యే ఓ యువతి బాగా డబ్బులు ఖర్చుపెట్టి ఇష్టమైన విధంగా హెయిర్ స్టైల్, మేకప్ వేసుకుని ట్రెండ్‌కు తగ్గట్టు హొయలుబోయింది. అయితే సదరు యువతి వేసుకున్న మేకప్ మహత్యమే ఏమో తెలియదు గానీ.. విమాన ప్రయాణానికి సిద్ధమైన ఓ మహిళా ప్రయాణికురాలు ఆమెను చూసి పురుషుడిగా పొరాబాటు పడింది. ఆమెను ఎంతో వినయంగా ‘సర్..’ అని సంబోధించింది. దీంతో బాగా హర్ట్ అయిన సదరు ఎయిర్ లైన్స్ మహిళా అధికారి వెంటనే ఆమెను విమానం దించేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ షాకింగ్ ఘటన యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో చోటుచేసుకుంది.
అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఆస్టిన్ బయలుదేరేందుకు బుధవారం యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం రన్‌వేపై సిద్ధంగా ఉంది. టెక్సాస్‌కు చెందిన జెన్నా లాంగోరియా తన 16 నెలల కుమారుడు, తల్లితో ఆ విమానం ఎక్కే సమయంలో అక్కడి సిబ్బందికి బోర్డింగ్ పాస్‌ను అందించింది. బోర్డింగ్ పాస్ చెక్‌చేసిన మహిళా అటెండెంట్‌ను పొరపాటుగా పురుషునిగా భావించిన జెన్నా ‘థాంక్యూ సర్..’ అని తెలిపింది. దీంతో ఆగ్రహానికి గురైన మహిళా అటెండెంట్ ప్రయాణికురాలి తల్లిని, బిడ్డతోపాటు ఆమెను లోనికి వెళ్లకుండా బయటే ఆపేసింది. దీంతో ఏం చేయాలో తెలియక జెన్నా మరో మేల్ ఫ్లైట్ అటెండెంట్‌కు తమను గేట్ వద్ద ఆపేసినట్లు ఫిర్యాదు చేసింది.
Mother and 16 month old baby DENIED entry to United Flight for using the wrong PRONOUNS for flight attendant.
“The flight attendant has denied access to us because he said I made a derogatory comment about one of the flight attendants because I didn’t use the right pronoun” pic.twitter.com/SyvqNJzdmF
— Oli London (@OliLondonTV) June 26, 2024
పొరబాటు గ్రహించిన మేల్ ఫ్లైట్ అటెండెంట్.. ఆ సిబ్బంది ‘పురుషుడు’ కాదు ‘మహిళ’ అని పొరబాటును సరిదిద్దాడు. తన తప్పును తెలుసుకుని ఆ మహిళా సిబ్బందికి క్షమాపణలు చేప్పేందుకు యత్నించినా.. ఆమె వినిపించుకోకపోగా తమను విమానం నుంచి దింపేశారని జెన్నా బుధవారం రాత్రి సోషల్ మీడియా ద్వారా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని నెటిజన్లతో పంచుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఎంతైనా అమ్మాయంటే కట్టు, జుట్టు, బొట్టు వంటి కాస్త ఆడ లక్షణాలు కనిపించాలి కదా..! ఇలా మగరాయుడిలా ఉంటే ఎవరైనా పొరబాటు పడతారు మరి!
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.